Begin typing your search above and press return to search.

జక్కన్న కోసం ఈ త్యాగాలు తప్పవు మహేషా..

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దబోతున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 May 2024 4:15 AM GMT
జక్కన్న కోసం ఈ త్యాగాలు తప్పవు మహేషా..
X

ఫెయిల్యూర్ అంటే తెలియని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దబోతున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీలో తన క్యారెక్టర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో కనిపించడం విశేషం. లుక్ పరంగా కూడా చాలా చేంజ్ చూపించబోతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారని సమాచారం.

ఇది ఇలా ఉంటే సాధారణంగా మహేష్ ప్రతీ సినిమాకు ముందు లేదా చివరలో ఏదో వెకేషన్ కు వెళ్లడం కామన్. లేదంటే షూటింగ్ కు కాస్త గ్యాప్ వచ్చినా ఒక వారం రోజులు ఫ్యామిలీ తో కలిసి ట్రిప్ కు వెళుతుంటారు. అయితే రాజమౌళితో సినిమా అంటే హీరోలకు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో చెప్పడం కష్టం. ఒక్కసారి ఆయనతో సినిమా స్టార్ట్ చేస్తే మాత్రం ప్రమోషన్స్ వరకు హీరోలు మరో పని పెట్టుకోకూడదు.

అలాంటిది మహేష్ ఇప్పుడు జక్కన్నతో సినిమా చేస్తున్నాడు కాబట్టి మహేష్ అలాంటివాన్ని పక్కన పెట్టాయాలి. ఆ విషయం మహేష్ కు కూడా ముందే తెలుసు. అందుకే షూటింగ్ కంటే ముందే ఫ్యామిలీ తో ఇప్పటికే ఒక మూడు ట్రిప్పులు వేసేశాడు. ఇక రీసెంట్ గా మరో ట్రిప్ వెళ్లాలని అనుకోగా సడన్ గా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో కలిసి ఏదో ఒక కంట్రీకి వెళ్లడం మహేష్ కు అలవాటు కానీ ఇప్పుడు జక్కన్న వర్క్ షాప్ స్టార్ట్ చేయాల్సి ఉందని చెప్పడంతో మహేష్ ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు.

సాధారణంగా మహేష్ ఏ డైరెక్టర్ తో అయినా సరే ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ చాలా రేర్ గా దొరుకుతుంది కాబట్టి ఇంకెంతలా వర్క్ చేస్తాడో ఊహించవచ్చు. అందుకే తనకు అలవాటైనా ఫ్యామిలీ వెకేషన్స్ కూడా వదిలేస్తున్నాడు. మరి మహేష్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ ప్రాజెక్టు కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారో చూడాలి.

ఇక SSMB29 అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. మరి జక్కన్న అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.