Begin typing your search above and press return to search.

గుంటూరు కారం' కోసం మహేష్ అంత కష్ట పడ్డారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' మరో 24 గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 6:23 AM GMT
గుంటూరు కారం కోసం మహేష్ అంత కష్ట పడ్డారా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' మరో 24 గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. త్రివిక్రమ్ - మహేష్ లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ మరింత హైప్ నెలకొంది.

చాలాకాలం తర్వాత ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటేఇటీవల జరిగిన 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడతారు అనే విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఒక సినిమా 100% బాగా రావాలంటే అందుకు 200% కష్టపడేది మహేష్ బాబు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పాడు.

త్రివిక్రమ్ చెప్పిన మాటలు నిజమేనని ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. విషయం ఏంటంటే, గుంటూరు కారం సినిమా కోసం మహేష్ పడ్డ కష్టం గురించి సినిమాకి పని చేసిన వ్యక్తి ఇలా చెప్పారు." గుంటూరు కారం సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో మిర్చి యార్డ్ సెట్ వేసి చాలా సీన్స్ ఫైట్స్ తీశారు. షూటింగ్ చేస్తున్నప్పుడు మిర్చి మధ్యలో తుమ్ములతో మహేష్ చాలా ఇబ్బంది పడ్డారు.

కానీ చాలా సార్లు తుమ్ములు ఆపుకుంటూ నటించాడు. ఆ ఘాటు మధ్యలో నిల్చొని డైలాగులు చెప్పడం, నటించడం నిజంగా గ్రేట్" అని అన్నాడు. దీన్నిబట్టి సినిమా కోసం మహేష్ ఎంతలా కష్టపడతారో, ఆయన డెడికేషన్ ఎలాంటిదో స్పష్టమవుతుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు.

ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావ్, వెన్నెల కిషోర్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.