Begin typing your search above and press return to search.

మహేష్ - పవన్.. నిజమైతే బాగుండు?

గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన జల్సా సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   6 Sept 2023 9:53 AM IST
మహేష్ - పవన్.. నిజమైతే బాగుండు?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి రిలేషన్ ఉంది. బర్త్ డే విషెష్ చెప్పుకోవడమే కాకుండా చాలా అంశాలలో ఒకే రకమైన ఐడియాలజీతో ఉంటారని సినీ వర్గాలలో వినిపించే మాట. పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా క్లోజ్. అతని మాటలు ఇద్దరు బలంగా నమ్మడంతో పాటు ఫాలో అవుతూ ఉంటారు .

గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన జల్సా సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు రివర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం పవన్ కళ్యాణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్, త్రివిక్రమ్ కలయికలో ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది.

మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో హీరో పాత్ర పరిచయం కోసం పవన్ కళ్యాణ్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారంట. దీనికి మహేష్ బాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్ లో పవన్ కళ్యాణ్ టైం స్పెండ్ చేసి త్రివిక్రమ్ మీద ఉన్న అభిమానంతో గుంటూరుకారం మూవీ కోసం వాయిస్ ఓవర్ ఇస్తాడా అనేది చూడాలి.

ఒక వేళ ఇస్తే మాత్రం కచ్చితంగా అటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకి కచ్చితంగా పండగలాంటి వార్త. అదే సమయంలో మూవీకి కూడా ఎక్స్ ట్రా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది అప్పడే చెప్పలేం. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మూవీ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లోకి వచ్చినపుడే సాధ్యం అవుతుంది.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో అతని ఫోకస్ అంతా కూడా వాటిమీదనే ఉంటాయి. అలాంటి సమయంలో ప్రత్యేకంగా త్రివిక్రమ్, మహేష్ బాబు మీద అభిమానంతో గుంటూరుకారం మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తాడా అనేది చూడాలి.