Begin typing your search above and press return to search.

సెల‌బ్రేష‌న్స్ లో మ‌హేష్‌-గౌత‌మ్ సంథింగ్ స్పెష‌ల్!

దీనిలో భాగంగా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు 31 రాత్రి భారీ ఎత్తున సెల‌బ్రేట్ చేసుకు న్న‌ట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   1 Jan 2024 8:09 AM GMT
సెల‌బ్రేష‌న్స్ లో మ‌హేష్‌-గౌత‌మ్ సంథింగ్ స్పెష‌ల్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా! వెకేష‌న్ తో పాటు ఓ యాడ్ షూడ్ కూడా ప్లాన్ చేసుకుని దుబాయ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప‌నిలో ప‌నిగా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు అక్క‌డే గ్రాండ్ గా ప్లాన్ చేసుక‌న్నారు. దీనిలో భాగంగా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు 31 రాత్రి భారీ ఎత్తున సెల‌బ్రేట్ చేసుకు న్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


అందులో మ‌హేష్..న‌మ్ర‌త‌..సితార‌..గౌత‌మ్ తో పాటు మ‌హేష్ కి అత్యంత స‌న్నిహితులు..స్నేహితులు కూడా సెల‌బ్రేష‌న్స్ లో భాగ‌మైన‌ట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల‌లో ఒక‌రైన న‌వీన్ ఏర్నేని కూడా భాగ‌మైన‌ట్లు క‌నిపిస్తుంది. మహేష్ తో సంస్థ కి ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈసారి వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొని స‌ర్ ప్రైజ్ చేసారు. ఓ పెద్ద స్టార్ హోట‌ల్ వేడ‌క ఎంతో గ్రాండ్ గా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.


స్నేహితుంలంద‌రికీతో మ‌హేష్ ఫ్యామిలీ కెమెరాకి ఫోజులిచ్చింది. మిడ్ నైట్ ఫోటోలు ఎంతో క‌ల‌ర్ పుల్ గా ఉన్నాయి. ఇక అన్నింటికంటే? ఒక‌ పిక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్పొచ్చు. మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ ఇద్ద‌రు అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ స‌మ‌యంలో మ‌హేష్ ..గౌత‌మ్ భుజాల‌పై చేతులు వేసి జీవిత పాఠాలు బోధిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇద్ద‌రు జీన్స్ అండ్ టీష‌ర్ట్ ధ‌రించారు. గౌతమ్ కొంత కాలంగా విదేశాల్లో ఉండ‌టం....మ‌హేష్ ఇండియాలో సినిమా ప‌నుల్లో బిజీగా ఉండ‌టంతో త‌న‌యుడ్ని మిస్ అయ్యారు.

దీంతో త‌న‌యుడిపై ప్రేమానురాగాలు పంచుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక అంద‌మైన హోట‌ల్ చుట్టూ క‌ల‌ర్ పుల్ లైట్లు ఎంతో మ‌నోహ‌రంగా లొకేష‌న్ క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నా యి. మ‌హేష్ ఫ్యామిలీని అలా చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గ‌త ఏడాది కూడా మ‌హేష్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఇలాగే దుబాయ్ హోట‌ల్ లోనే సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.