Begin typing your search above and press return to search.

మ‌హేష్ కి ఇష్ట‌మైన‌వి అభిమానుల కోసం!

ఈ మ‌ధ్య‌నే స్టేజ్ ఎక్కి ఏకంగా డాన్సులు వేయ‌డం కూడా మొద‌లు పెట్టారు. 'యానిమ‌ల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ స‌న్నివేశం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిం దే. ఇవ‌న్నీ ఒకే మ‌రి.

By:  Tupaki Desk   |   7 Jan 2024 9:30 AM GMT
మ‌హేష్ కి ఇష్ట‌మైన‌వి అభిమానుల కోసం!
X

మ‌హేష్ అంటే అంద‌రికీ సూప‌ర్ స్టార్..మంచి ఫ్యామిలీ మెన్ గా మాత్ర‌మే తెలుసు. షూటింగ్ ఉంటే సెట్స్ లోనే లేదంటే ఇంట్లో! ఇంకా టైమ్ దొరికితే ఫ్యామిలీతో వెకేష‌న్ లో విదేశాల్లో ఉంటారు. ఇండియాలో అంత స్వేచ్ఛ ఉండ‌దు కాబ‌ట్టి త‌న స‌ర‌దాల‌న్నీ విదేశాల్లోనే ప్లాన్ చేసుకుంటారు. అక్క‌డ త‌న‌కు న‌చ్చిన విధంగా స్వేచ్ఛ‌గా గ‌ల్లీ గ‌ల్లీ తిరిగేస్తారు. అలాగే గ‌తంలో మ‌హ‌ష్ రిజ‌ర్వ్ గా ఉండేవారు? అయితే అది నెమ్మ‌దిగా తొలగిపోయింది.

ఆయ‌న ఇప్పుడు పెద్ద కామెడీ ప‌ర్స‌నాల్టీ అయిపోయారు. అంద‌రితోనూ జోకులు..పంచ్ లు వేస్తూ ఎంతో స‌ర‌దాగా ఉంటారు? అన్న‌ది తోటి న‌టులు చెబుతుంటే తెలుస్తుంది. చాలా కాలంగా మీడియా ఇంట‌రాక్ష‌న్ లోనూ త‌న లో చ‌లాకీత‌నం చూపిస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే స్టేజ్ ఎక్కి ఏకంగా డాన్సులు వేయ‌డం కూడా మొద‌లు పెట్టారు. 'యానిమ‌ల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ స‌న్నివేశం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిం దే. ఇవ‌న్నీ ఒకే మ‌రి.

మ‌రి వ్య‌క్తిగ‌తంగా మ‌హేష్ ఇష్టా ఇష్టాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న‌కు ఇష్ట‌మైన రంగు నీలం. ఆరంగు ష‌ర్ట్ లు ర‌క‌ర‌కాల షేడ్ల‌తో దాదాపు పాతిక వ‌ర‌కూ ఉంటాయ‌ట‌. అలాగే ఇష్టంగా అప్పు డప్పుడు తినేది హైద‌రాబాదీ బిర్యానీ..అమ్మ‌మ్మ చేతి వంట‌..అమ్మ చేతి కాపీ. న‌చ్చిన సినిమా తండ్రి కృష్ణ‌ న‌టించిన 'అల్లూరి సీతారామ‌రాజు'. ఇష్ట‌మైన ప‌ర్యాట‌క ప్రాంతం యూర‌ప్.

బెస్ట్ ప్రెండ్ న‌మ్ర‌త‌. ఇక బ‌ల‌హీనత‌ల విష‌యానికి వ‌చ్చేస్తే వెంట‌నే నో చెప్ప‌లేరుట‌. క్ర‌మ శిక్ష‌ణ అనేది నాన్న గారి నుంచే అల‌వాటైందంటున్నారు. ఇప్ప‌టికీ దిన‌చ‌ర్య ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం జ‌రుగుతుందన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ త‌న బ‌లం అంటున్నారు. విదేశాలు వెళ్లిన‌ప్పుడు న‌చ్చిన వాటిని అన్నింటిని లాగించేస్తారుట‌. అక్క‌డ‌కి వెళ్లి బ‌రువు పెరిగినా మ‌ళ్లీ ఇంటికి ఆ బ‌రువుని బ్యాలెన్స్ చేసేలా క‌స‌ర‌త్తులు చేస్తాన‌న్నారు.