Begin typing your search above and press return to search.

పూరీని గుర్తు చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్..!

స్టార్ తో సినిమా అంటే ఆ ఇమేజ్ కి తగిన కథ అందుకు తగిన కథనం ఉంటేనే ఫ్యాన్స్ కి అంచనాలను అందుకుంటుంది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:30 PM GMT
పూరీని గుర్తు చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్..!
X

స్టార్ తో సినిమా అంటే ఆ ఇమేజ్ కి తగిన కథ అందుకు తగిన కథనం ఉంటేనే ఫ్యాన్స్ కి అంచనాలను అందుకుంటుంది. స్టార్ హీరో వీరాభిమానులు ఆ హీరోని జస్ట్ అలా నిలబెట్టినా సరే వావ్ అనేస్తారు. అది ఎవరైనా చేస్తారు కానీ ఆ స్టార్ తో మ్యాజిక్ చేసిన వారిని మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ విషయంలో అలా మ్యాజిక్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అలా ఎందుకు అంటే సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం లో కేవలం మహేష్ ఎఫర్ట్ తప్ప మిగతా ఏది కనిపించలేదు.

త్రివిక్రం ఎందుకో తన మార్క్ చూపించలేకపోయాడని ఓపెన్ టాక్. మహేష్ మాత్రం రమణ పాత్రలో రఫ్ఫాడించాడు. సినిమా మొత్తం తనే అన్నట్టుగా కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని విధాలుగా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేశాడు. మామూలుగా అయితే స్టార్ హీరోల సినిమాల్లో డైరెక్షన్ పాళ్లు చాలా ఉంటే హీరో తాలూకా కష్టం తెర మీద కాస్త కనబడుతుంది. కానీ గుంటూరు కారం విషయంలో మహేష్ కష్టం చాలా ఉంటే గురూజీ పనితనం తక్కువ అన్నట్టు వినిపిస్తుంది.

ఈ విషయం మీదే సూపర్ స్టార్ మహేష్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్స్ గురించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు పూరీ జగన్నాథ్. మహేష్ తో పూరీ చేసిన రెండు సినిమాలు రెండు సూపర్ హిట్లే. మొదట వచ్చిన పోకిరి గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసిన ఘనత ఆ సినిమాది. మహేష్ పండుగాడి పాత్రలో క్లాసు మాసు అనే తేడా లేకుండా దుమ్ము దులిపేశాడు.

ఇక నెక్స్ట్ వచ్చిన బిజినెస్ మెన్ సినిమా కూడా అంతే. సూర్య భాయ్ గా మహేష్ ని మరో యాంగిల్ లో చూపించి వావ్ అనిపించాడు పూరీ. మహేష్ స్టామినాని.. యాక్టింగ్ టాలెంట్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో థర్డ్ ప్రాజెక్ట్ గా జన గణ మన చేయాలని అనుకున్నారు. కానీ పూరీ ట్రాక్ తప్పేయడంతో మహేష్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గుంటూరు కారం సినిమా చూశాక పూరీ జగన్నాథ్ మాత్రమే మహేష్ ని 100కి 100 శాతం వాడుకున్నాడని.. సూపర్ స్టార్ ఇమేజ్ కి తగినట్టుగా కథ కథనాలు రాసుకుంటాడని గుర్తు చేసుకుంటున్నారు. ఎంతైనా మహేష్ కి రెండు మర్చిపోలేని హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కదా ఫ్యాన్స్ కి అలా గుర్తుండిపోతుంది అంతే.