Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ 3 ఏళ్లు వెయిటింగ్ తప్పదు..!

ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో జత కడుతున్నాడు. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సిందే.

By:  Tupaki Desk   |   13 Jan 2024 4:49 AM GMT
సూపర్ స్టార్ ఫ్యాన్స్ 3 ఏళ్లు వెయిటింగ్ తప్పదు..!
X

స్టార్ హీరోల సినిమాలు ఎంత లేట్ అయితే అంత నిర్మాతకు భారమని తెలిసిందే. కోట్ల కొద్దీ బడ్జెట్ తమ జేబుల్లోంచి కాకుండా బయట ఇంట్రెస్ట్ లకు తెచ్చి మరి పెడుతుంటారు. సినిమా అనుకున్న విధంగా అనుకున్న టైం కు రిలీజ్ అయితే ఓకే.. అలా కాకుండా షూటింగ్ లేట్ అవ్వడం.. రిలీజ్ వాయిదా పడటం లాంటివి అయితే మాత్రం నిర్మాతకు గుండె బరువెక్కడం ఖాయం. అయితే ఇది కేవలం మిగతా దర్శకుల విషయంలోనే అదే దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అయితే ఎంత లేట్ అయితే అంత మంచిదని భావిస్తారు. రాజమౌళి సినిమా అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే ముద్ర బలంగా పడిపోయింది.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాలో మహేష్ హీరోగా నటిస్తాడని తెలిసిందే. ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా గురించి ఇప్పటికే అంచనాలు అదిరిపోతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఈ కథ ఉంటుందని ఆల్రెడీ ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ తప్ప మరో స్పెషల్ థింగ్ ఏమి కనిపించలేదు అన్నది ఒప్పుకోవాల్సిందే. మహేష్ వన్ మ్యాన్ షో చేసినా ఫ్యాన్స్ కి నచ్చింది తప్ప కామన్ ఆడియన్స్ గుంటూరు కారం కష్టమే అంటున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో జత కడుతున్నాడు. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. సినిమాలో కనిపించే ప్రతి సీన్, ప్రతి ఫ్రేం తన ఆధ్వర్యంలో ఉండేలా జాగ్రత్త పడతాడు రాజమౌళి. అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు కాబట్టే ఆయన సినిమాలు ఆ రేంజ్ లో ఆడుతున్నాయి. అయితే మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన జక్కన్న త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎలా చూసినా సరే ఈ సినిమా రెండేళ్లు షూటింగ్ మరో ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ అంటే దాదాపు 3 ఏళ్ల దాకా పడుతుంది. 2024 మొదట్లో గుంటూరు కారంతో ఫ్యాన్స్ ముందుకొచ్చిన మహేష్ మళ్లీ 3 ఏళ్లకు అంటే 2027 లోనే తన సినిమాతో వస్తాడని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఈ గ్యాప్ లో సినిమా అప్డేట్స్ తో రాజమౌళి ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తాడనుకోండి. అయినా సరే 3 ఏళ్లు ఒక సినిమాకు రాసివ్వడం అనేది హీరోలకు ఎంతోకొంత డ్యామేజ్ చేస్తుంది. అయితే రాజమౌళి సినిమాకు ఎన్నేళ్లు రాసిచ్చినా ఆ తర్వాత ఆ సినిమా ఇచ్చే ఫలితం అంతకంత రెట్టింపు క్రేజ్ తెచ్చి పెడుతుంది. రాజమౌళి మహేష్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి అనుకున్న టైం ప్రకారం రిలీజ్ చేయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.