Begin typing your search above and press return to search.

అమ్మ‌-నాన్న‌ల‌తో పోల్చిన 'ఒక్క‌డు ' కాదు ఒకే ఒక్క‌డు!

నా అమ్మ‌-నాన్న లేరు. ఇక అమ్మ‌-నాన్న అన్నీ మీరే అంటూ ఎంతో ఎమోష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jan 2024 11:09 AM GMT
అమ్మ‌-నాన్న‌ల‌తో పోల్చిన ఒక్క‌డు  కాదు ఒకే ఒక్క‌డు!
X

అభిమానుల్ని ఏ హీరో అయినా అమ్మ‌నాన్న‌ల‌తో పోల్చ‌డం ఎప్పుడైనా చూసారా? అలాంటి స‌న్నివేశం తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడైనా చోటు చేసుకుందా? అంత మంది హీరోలున్నారు ఎవ‌రైనా నా త‌ల్లి..తండ్రి అభిమానులే అని చెప్పింది ఉందా? అది కేవ‌లం సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి మాత్ర‌మే చెల్లింది. ద‌శాబ్ధాల తెలుగు సినిమా జ‌ర్నీలో ఏ నాడు..ఏ హీరో కూడా అభిమానుల్ని అమ్మ‌నాన్న‌ల‌తో పొల్చింది లేదు.

తొలిసారి మ‌హేష్ 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ సంద‌ర్భంగా సొంత జిల్లాని...అక్క‌డికి త‌ర‌లి వ‌చ్చిన ప్రేక్ష‌కాభిమానుల్ని చూసి ఎంతో ఉద్వేగ ఉద్విగ్న క్ష‌ణాల‌కు గుర‌య్యారు. నా అమ్మ‌-నాన్న లేరు. ఇక అమ్మ‌-నాన్న అన్నీ మీరే అంటూ ఎంతో ఎమోష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ మ‌న‌సులోతులో నుంచి వ‌చ్చిన ఆ మాట‌ల్ని విని అభిమానులు అంతే ఎమోష‌న్ కి గుర‌య్యారు. అభిమానుల్ని తానెంత ప్రేమిస్తాడు అన్న‌ది ఆ మాట‌తో మ‌రోసారి అర్ధ‌మైంది.

నిజ‌మే అభిమానుల్ని అమ్మ‌-నాన్న‌ల‌తో పోల్చ‌డం అంటే చిన్న విష‌యం. ప్ర‌పంచంలో అమ్మ‌-నాన్న‌ల‌కంటే ఏదీ గొప్ప‌దు కాదు. అంటే అభిమానులంటే మ‌హేష్ కి ఎంత ఇష్టం అన్న‌ది నిన్న‌టి స‌న్నివేశం మ‌రోసారి రుజువు చేసింది. అభిమానుల్ని ఇలా అమ్మ‌-నాన్న‌తో ఏ హీరో కూడా పోల్చ‌లేదు. అభిమానుల్ని దైవ స‌మానంగా పోల్చిన హీరోలెంతో మంది ఉన్నారు.

మీరు లేక‌పోతే నేను లేను..మీరే నా దేవుళ్లు...నేను ఆరాదించే దైవం మీరే అంటూ చాలా మంది హీరోలు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. శిర‌స్సు వంచి..పాదాబివంద‌నం చేస్తూ ఎంతో మంది హీరోలు అభిమానుల గురించి గొప్ప‌గా చెప్పిన సందర్బాలెన్నో ఉన్నాయి. కానీ నిన్న‌టి రోజును గుంటూరులో చోటు చేసుకున్న మ‌హేష్ వ్యాఖ్య‌లు మాత్రం ఆయ‌న అభిమానుల గుండెల్లోకి బాణాల్లా దూసుకెళ్లాయన్న‌ది వాస్త‌వం.