Begin typing your search above and press return to search.

రాజమౌళి సినిమాతో మహేష్ కి భారీ లాస్..?

అయితే ఈ సినిమా కోసం మహేష్ రెమ్యునరేషన్ గా మహా అంటే ఒక 100 కోట్లకు అటు ఇటుగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   15 March 2024 10:30 AM GMT
రాజమౌళి సినిమాతో మహేష్ కి భారీ లాస్..?
X

సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు కలిసి చేసే సినిమాపై నేషనల్ లెవెల్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల దాకా డేట్స్ ఇచ్చేశాడని తెలుస్తుంది. రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు మూడేళ్లు లేనిది సినిమా పూర్తి కాదు. మహేష్ తో చేస్తున్న సినిమా రెండు భాగాలని వినిపిస్తుంది. సో ఎలా లేదన్నా ఒక 3 నుంచి నాలుగేళ్ల దాకా మహేష్ ఈ సినిమా కోసం టైం కేటాయించాల్సిందే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కోసం మహేష్ రెమ్యునరేషన్ గా మహా అంటే ఒక 100 కోట్లకు అటు ఇటుగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటే మహేష్ కి ఒక 100 రాజమౌళికి ఒక 50 నుంచి 80 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తుంది. అయితే మహేష్ బాబు 4 ఏళ్లు డేట్స్ ఇచ్చి కేవలం 100 కోట్లు తీసుకోవడం అంటే అది ఆయనకు భారీ లాస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ ప్రతి సినిమాకు ప్రస్తుతం 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. నాలుగేళ్లలో నాలుగు సినిమాలు కనీసం 3 సినిమాలు చేసినా 150 నుంచి 200 కోట్ల దాకా వర్క్ అవుట్ అవుతుంది. అవే కాకుండా ప్రతి ఏడాది మహేష్ యాడ్స్ ద్వారా మరో 20 నుంచి 40 కోట్ల దాకా తీసుకుంటాడు.

రాజమౌళి సినిమా అంటే మహేష్ ఎలాంటి యాడ్స్ చేసే అవకాశం లేదు. సో నాలుగేళ్లు బయట సినిమా చేస్తే 300 కోట్ల దాకా సంపాదించే మహేష్ 200 కోట్లు లాస్ అయ్యి కేవలం జక్కన్న సినిమాకు 100 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. ఇదంతా మహేష్ కాలిక్యులేట్ చేసుకుని ఉంటాడని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.

అయితే లాస్ 200 కోట్ల గురించి ఆలోచిస్తే బాహుబలితో ప్రభాస్, ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు వచ్చిన గుర్తింపు గురించి ఆలోచించాలి. ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళికి ఇంటర్నేషనల్ లెవెల్ లో బ్రాండ్ క్రియేట్ అయ్యింది. సో మహేష్ తో చేస్తున్న సినిమా ఎలా లేదన్నా కూడా హాలీవుడ్ అప్పీల్ ఉంటుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రెమ్యునరేషన్ లెక్కలన్నీ పక్కన పెడితే రాజమౌళితో మహేష్ సినిమా 100కి 100 శాతం ప్రాఫిటబుల్ వెంచరే అని చెప్పొచ్చు.