Begin typing your search above and press return to search.

జిమ్ లో కసిగా మహేష్… దేనికోసమంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు

By:  Tupaki Desk   |   17 Aug 2023 3:56 AM GMT
జిమ్ లో కసిగా మహేష్… దేనికోసమంటే
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. రెగ్యులర్ గా తనకి సంబందించిన యాక్టివిటీస్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిన వాటిని కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకోవడం ద్వారా తన నుంచి అభిమానులు కోరుకునే బాండింగ్ ని అందిస్తూ ఉన్నారు.


ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తోన్న ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. హ్యాండ్స్ కి సంబందించిన ఎక్సర్ సైజ్ ని చేస్తున్నారు ఆ ఫోటోని హిత్ మాథ్యూస్, మనీష్ గాబ్రియల్ కి ట్యాగ్ చేశారు. మనీష్ ఫిట్ నెస్ ట్రైనర్ కాగా, మాథ్యూస్ ఫిజియోథెరఫిస్ట్ కావడం గమనార్హం.

దీనిని బట్టి మహేష్ నిపుణుల సలహాలు, సూచనలతో వారి నిర్ధేకత్వంలోనే బాడీ ట్రాన్స్ ఫార్మెన్ కి సంబందించిన వర్క్ అవుట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్క్ అవుట్ లు చూస్తుంటే గుంటూరు కారం కోసం కాకుండా నెక్స్ట్ రాబోయే రాజమౌళి సినిమా కోసం అని అర్ధమవుతోంది. ఈ ఏడాది ఆఖరు జక్కన్న మూవీ స్టార్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

అందులో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు కనిపించనున్నారు. ఆ క్యారెక్టరైజేషన్ కోసం అదిరిపోయే లుక్ లోకి ట్రాన్సఫర్మ అవుతున్నారు . దానికోసం ప్రత్యేకంగా నిపుణులతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండటం విశేషం. మరో వైపు గుంటూరు కారం సినిమాలో కూడా ఇదే లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ ఏ సినిమాలో అయిన కండలు తిరిగిన దేహంతో కనిపించే ప్రయత్నం చేయడు.

స్టైలిష్ అండ్ మ్యాన్స్లీ లుక్ లోనే కనిపిస్తారు. అయితే జక్కన్న సినిమా కోసం మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని లుక్, బాడీ షేప్స్ తో మహేష్ బాబు కనిపించనున్నారంట. దానికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వర్క్ అవుట్ లు అన్ని రెగ్యులర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది.