Begin typing your search above and press return to search.

మ‌హేష్ మ‌రో స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కొత్త ప్రాజెక్ట్ కోసం జ‌ర్మ‌నీ వెళ్లొచ్చిన ద‌గ్గ‌ర నుంచి సైలెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 March 2024 3:00 AM GMT
మ‌హేష్ మ‌రో స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కొత్త ప్రాజెక్ట్ కోసం జ‌ర్మ‌నీ వెళ్లొచ్చిన ద‌గ్గ‌ర నుంచి సైలెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ లోనూ ఉంటూ ఇంట్లో సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. రాజ‌మౌళి ఎప్పుడైనా పిలిచే అవ‌కాశం ఉండ‌టంతో ఎటు క‌ద‌ల‌కుండా హైద‌రాబాద్ లోనే ఉంటున్నారు. లేదంటే ఇప్ప‌టికే కుటుంబంతో ఓ రెండుసార్లు విదేశాల‌కు వెకేష‌న్లు వెళ్లొచ్చేవారు. మ‌రిప్పుడు వెకేషన్ వెళ్ల‌డానికి ఛాన్స్ లేదా? ఎందుకు లేదు! ఓ ఛాన్స్ ఉండ‌నే ఉంద‌ని తాజాగా అందుతోన్న స‌మాచారం.

ప్ర‌స్తుతానికి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌హేష్ ఇంకా రంగంలోకి దిగ‌లేదు. రాజ‌మౌళి మాత్ర‌మే ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇంకా మ‌హేష్ పై లుక్ టెస్ట్ గానీ...అవ‌స‌ర‌మైన వ‌ర్క్ షాప్ లు గానీ నిర్వ‌హించ‌లేదు. తాజాగా అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం లుక్ టెస్ట్ కి మ‌రో నెల రోజులైనా ప‌ట్టే అవ కాశం ఉంద‌ని.. ఆ త‌ర్వాత వ‌ర్క్ షాప్స్ ప్రారంభించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారుట‌.

దీంతో ఆ గ్యాప్ ని మ‌హేష్ వెకేష‌న్ కోసం వినియోగించుకునే లా ప్లాన్ చేస్తున్నార‌ని తాజాగా లీకైంది. కుటుంబంతో ఓ కొత్త ప్ర‌దేశానికి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నెలాఖ‌రున మ‌హేష్ వెళ్లే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అటు నుంచి అటు అమెరికాలో ఉన్న గౌత‌మ్ ని వ‌ద్ద‌కు వెళ్లేలా ప్లాన్ చేసు కుంటున్నారుట‌. ప్ర‌స్తుతం సితార‌కు స‌మ్మ‌ర్ హాలీడేస్ కూడా. దీంతో ఈ సెల‌వుల్ని మ‌హేష్ వినియోగించుకునే అవ‌కాశం ఉంది.

మ‌హేష్ చివ‌రిగా కుటుంబంతో క‌లిసి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం దుబాయ్ వెళ్లారు. ఆ త‌ర్వాత ఎలాంటి వెకేష‌న్లు ప్లాన్ చేయ‌లేదు. 'గుంటూరు కారం' రిలీజ్ త‌ర్వాత వెళ్లే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి గానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఆ వెంట‌నే ట్రైనింగ్ కోసం జ‌ర్మ‌నీ వెళ్ల‌డంతో రాజ‌మౌళి సినిమా ప్రారంభ‌మై పోతుంద‌ని అంతా భావించారు.