Begin typing your search above and press return to search.

బాబుతో SRH గ్యాంగ్.. ఇది కిక్కిచ్చే ఫీల్ సామీ!

క్రికెట్ అయినా సినిమా అయినా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   22 April 2024 4:47 PM GMT
బాబుతో SRH గ్యాంగ్.. ఇది కిక్కిచ్చే ఫీల్ సామీ!
X

క్రికెట్ అయినా సినిమా అయినా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ రెండు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు మన స్టార్ హీరోలు రియల్ క్రికెటర్స్ ని కలుసుకుంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ఇక అందులోనూ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో కనిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది.

రీసెంట్ గా మహేష్ బాబు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. బహుశా ఒక కమర్షియల్ యాడ్, ఫొటో షూట్ ఏదైనా చేస్తున్నారో ఏమో కానీ ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దాదాపు టీమ్ లోని సభ్యులందరూ కూడా బాబు గారితో ఫోటోలు దిగడం విశేషం. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా బాబుతో ప్రత్యేకంగా స్టిల్ ఇచ్చాడు.

దాదాపు ఇద్దరు కూడా వారి స్మైల్ తో స్టిల్ ఇవ్వడం ఫోటోలో మరింత హైలెట్ గా నిలిచింది. అంతేకాకుండా కామెంట్ సెక్షన్ లో అయితే మహేష్ బాబు కమిన్స్ కు సంబంధించిన ఫోటో స్టిల్స్ కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇక మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ SRH టీమ్ ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని వివరణ ఇచ్చాడు.

ఇక మయాంక్ అగర్వాల్ నితీష్ రెడ్డి భువనేశ్వర్ కుమార్ ఇలా కీలక ఆటగాళ్లు అందరూ కూడా మహేష్ బాబుతో నవ్వుతూ ఫోటోకి స్టిల్స్ అయితే ఇచ్చారు. ఇక ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ లో హైదరాబాద్ టీమ్ మిగతా టీమ్ కు చెమటలు పట్టించేలా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తప్పకుండా ఈసారి ట్రోఫీ విన్నర్ గా నిలుస్తుంది అని ఫాన్స్ లో అయితే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయకూడని సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసమే ఇంత స్మార్ట్ లుక్ ను సెట్ చేసుకున్నారు. బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న ఆ ప్రాజెక్టుపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ రాబోతోంది.