Begin typing your search above and press return to search.

మ‌హేష్ కొడుకు గౌత‌మ్ అమెరికాకు?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ అమెరికాలో ఉన్నత చదువులు చదవబోతున్నాడు. ఆ మేర‌కు నమ్రత శిరోద్కర్ త‌న ఎగ్జ‌యిట్ మెంట్ ని దాచుకోకుండా ఓపెన‌య్యారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:52 AM GMT
మ‌హేష్ కొడుకు గౌత‌మ్ అమెరికాకు?
X

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ అమెరికాలో ఉన్నత చదువులు చదవబోతున్నాడు. ఆ మేర‌కు నమ్రత శిరోద్కర్ త‌న ఎగ్జ‌యిట్ మెంట్ ని దాచుకోకుండా ఓపెన‌య్యారు. తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదవనున్నాడని వెల్ల‌డించారు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన అభిమానులు, అనుచరులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేసారు. ఆదివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత త‌న కుమారుడు గౌత‌మ్ తో క‌లిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అస‌లు విష‌యం చెప్ప‌డంతో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.


ఇన్ స్టాలో న‌మ్ర‌త షేర్ చేసిన‌ ఫోటోలో నమ్రత - గౌతమ్ కార్ లో కూచుని క‌నిపించారు. నమ్రత ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది, "NYU లో క‌ట్టుబాట్లు (స్ట‌డీస్)!! గౌతమ్ ఘట్టమనేని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు" అని రాసారు. "నా చిన్న పిల్లవాడు (హార్ట్ ఐ ఎమోజీలు) ఈ క్ష‌ణానికి రావ‌డానికి కృషి, అభిరుచి, సంకల్పం గురించి చాలా గర్వంగా ఉంది. బిగ్ ఆపిల్ ఇప్పుడే ప్రకాశవంతమైన కొత్త స్టార్ గా మారాడు! (స్టార్ ఎమోజి) ప్రేమ ప్రేమ .. నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాను" అని ఎగ్జ‌యిట్ అవుతూ వెల్ల‌డించారు.

సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు:

ఈ పోస్ట్‌పై న‌మ్ర‌త సోద‌రి శిల్పా శిరోద్కర్ స్పందిస్తూ.. "లవ్ యూ మై బేబీ, సో సో సో ప్రౌడ్ ఆఫ్ యు" అని రాసారు.'గర్వించదగిన సోదరి' అని అనుష్క రంజిత్ వ్యాఖ్యానించారు. మ‌నోజ్ భార్య‌ విరానికా మంచు ఇలా రాసారు. "అయ్యా!!! అభినందనలు! నా అల్మా మేటర్. వావ్! అభినందనలు గౌతమ్!" అని వ్యాఖ్య‌ను జోడించారు. ఒక అభిమాని ఇలా రాసాడు. "అతడి గురించి చాలా గర్వంగా ఉంది. పెద్ద అభినందనలు !! గౌత‌మ్ రాకింగ్ చేస్తూ ఉండండి" అని రాసాడు. "మీరు చాలా వేగంగా ఎదిగినందుకు అభినందనలు.. ఈ ఉద్విగ్న‌మైన‌ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు మీకు శుభాకాంక్షలు అని మ‌రొక అభిమాని వ్యాఖ్యానించారు.

గౌతమ్ కృష్ణ‌.. మహేష్ బాబు-న‌మ్ర‌త‌ల ఏకైక‌ కుమారుడు. 2005లో మ‌హేష్- న‌మ్ర‌త ప్రేమ వివాహం చేసుకున్నారు. 2006లో గౌతమ్‌ను స్వాగతించారు. ఈ దంపతులకు కొన్ని సంవత్సరాల తర్వాత సితార ఘట్టమనేని అనే కుమార్తె జ‌న్మించింది.