Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : సూపర్ స్టార్‌ ఫ్యామిలీ మూమెంట్‌

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా విడుదలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 7:08 AM GMT
పిక్‌ టాక్ : సూపర్ స్టార్‌ ఫ్యామిలీ మూమెంట్‌
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా విడుదలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దర్శకుడు త్రివిక్రమ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ లో బిజీగా ఉన్నాడు.


ఇటీవలే మహేష్ బాబు షూటింగ్‌ ముగించి కొత్త సంవత్సర వేడుకల కోసం విదేశాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లిన విషయం తెల్సిందే. గుంటూరు కారం సినిమా కోసం ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఈ సమయంలో మహేష్ బాబు రిలాక్స్ గా న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకుంటూ ఉన్నాడు


గుంటూరు కారం సినిమాపై ఆయనుకు చాలా నమ్మకం కావచ్చు.. అందుకే ఈ స్థాయిలో రిలాక్స్ గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మహేష్‌ బాబు తీసిన ఈ సెల్ఫీ తెగ వైరల్ అవుతోంది.

కొడుకు, కూతురు మరియు ఇతర కుటుంబ సభ్యులతో మహేష్‌ బాబు తీసిన సెల్ఫీ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహేష్‌ బాబు లుక్ మరియు ఆయన సింప్లిసిటీ చూసి అంతా కూడా వావ్‌ అంటున్నారు. ఇలా కాస్త ఎక్కువ గడ్డంతో మహేష్ భలేగా మ్యాన్లీ గా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే శ్రీ లీల హీరోయిన్‌ గా నటించగా మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన పాటలు మ్యూజికల్‌ హిట్ గా నిలిచాయి. సంక్రాంతికి గుంటూరు కారం కుమ్మేయడం ఖాయం అనిపిస్తోంది.