Begin typing your search above and press return to search.

కొన్నాళ్లు మనం మహేశ్ బాబును మర్చిపోవాల్సిందే!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Feb 2024 2:30 PM GMT
కొన్నాళ్లు మనం మహేశ్ బాబును మర్చిపోవాల్సిందే!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ అడ్వంచర్ మూవీ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. 'ఇండియానా జోన్స్' తరహాలో అడ్వెంచరస్ గా ఉంటుందని, గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీ అని జక్కన్న స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో మహేశ్ లుక్ ఎలా ఉంటుంది.. ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది.

గత కొంతకాలంగా ఒకే రకమైన లుక్ లో కనిపించిన మహేష్ బాబు.. ఇటీవల 'గుంటూరు కారం' సినిమా ద్వారా తన కెరీర్ లోనే బెస్ట్ లుక్ లోకి మారిపోయారు. ఇంతక ముందు చూడని విధంగా గడ్డం, మీసాలతో మాసీగా కొత్తగా కనిపించారు. దీన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, మహేశ్ ప్రజెంట్ లుక్ బయటకి వచ్చింది. ఇందులో ఆయన గుబురు గడ్డం, మీసాలు.. లాంగ్ హెయిర్ తో చాలా స్టైలిష్ గా కనిపించారు. దీంతో రాబోయే సినిమాలో ఇదే లుక్ ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

నిజానికి రాజమౌళి సినిమా అంటే ఎంత కచ్ఛితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రీ ప్రొడక్షన్ దశలోనే అన్నీ పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. ట్రైనింగ్ సెషన్లు, వర్క్ షాప్స్, రిహార్సల్స్ చేస్తారు. హీరోల లుక్, మేకోవర్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. వారి గత చిత్రాల కంటే చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. అఫిషియల్ గా రిలీజ్ చేసే వరకూ హీరోల గెటప్స్, లుక్స్ బయటకు రాకుండా పకడ్బందీగా ప్లానింగ్ చేస్తారు. అందులోనూ ఇది దర్శకుడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి, ఈ విషయాల్లో మరింత కచ్ఛితంగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు.

ఇప్పటి వరకూ ఎక్కువ శాతం సెట్స్ లోనే షూటింగ్ చేస్తూ వచ్చిన మహేష్ బాబు.. రాజమౌళి మూవీ కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉండాల్సిన అవసరముంది. దీనికి తోడు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ కాబట్టి, జిమ్ లో హార్డ్ వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లుక్, మేకోవర్‌ తో పాటుగా యాక్షన్ సీన్స్ కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీని కోసం ఇప్పటికే ప్రిప‌రేష‌న్ స్టార్ట్ చేసిన మహేష్.. తన లుక్ రివీల్ అవ్వకుండా రాబోయే కొన్ని నెలల పాటు పబ్లిక్ అప్పీరియన్స్ కు దూరంగా ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఒక్కసారి ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఇప్పట్లో సూపర్ స్టార్ దర్శనం ఉండకపోవచ్చనీ అంటున్నారు.

RRR వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం.. మహేష్ బాబు నటిస్తున్న ఫస్ట్ మల్టీ లాంగ్వేజ్ మూవీ కావడంతో సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకూ అందరూ 'SSMB 29' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటుండగా.. ఇకపై 'SSRMB' అని మేకర్స్ ప్రచారం చేస్తారని టాక్ వచ్చింది. మరోవైపు ''మహారాజా" "చక్రవర్తి" వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వచ్చాయి. 2024 సమ్మర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారని అంటున్నారు. వీటన్నింటిపై ఎప్పటిలాగే జక్కన్న అండ్ టీమ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది