Begin typing your search above and press return to search.

మహేష్‌ - రాజమౌళి మూవీ ఉగాదికి కాదు.. బర్త్‌డేకి!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా మహేష్ బాబుతో అనే విషయం కన్ఫర్మ్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   26 March 2024 5:14 AM GMT
మహేష్‌ - రాజమౌళి మూవీ ఉగాదికి కాదు.. బర్త్‌డేకి!
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా మహేష్ బాబుతో అనే విషయం కన్ఫర్మ్‌ అయ్యింది. ఇటీవలే రాజమౌళి జపాన్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మహేష్ బాబుతో తన తదుపరి సినిమా ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు గ్యాప్ తీసుకుని రాజమౌళి సినిమా కోసం కొత్త గెటప్‌ కి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే గడ్డం మరియు మీసాలు పెంచడం ద్వారా విభిన్నమైన లుక్‌ లోకి వచ్చాడు. ఇక కండలు పెంచేందుకు కూడా మహేష్ బాబు వర్కౌట్స్ మొదలు పెట్టాడు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.

నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీ అధికారిక ప్రకటన ఏప్రిల్‌ 9న ఉగాది కానుకగా రాబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్భంగా అంటే ఆగస్టు 9న సినిమా అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌ ఉంటుందని తెలుస్తోంది.

ఆగస్టు 9న మహేష్ బాబుతో కలిసి రాజమౌళి మీడియా ముందుకు రాబోతున్నాడు. ఆ రోజున సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసే విధంగా ఒక కాన్సెప్ట్‌ పోస్టర్ ను కూడా విడుదల చేసే విధంగా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హాలీవుడ్‌ రేంజ్ లో భారీ అడ్వంచర్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా ఈ సినిమా ను రాజమౌళి రూపొందించబోతున్నాడు. మెజార్టీ పార్ట్ విదేశాల్లో చిత్రీకరించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ఈ సినిమాలో నటింపజేసేందుకు రాజమౌళి చర్చలు జరుపుతున్నాడు అనే వార్తలు రెండు మూడు రోజులుగా వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని విషయాలపై మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.