Begin typing your search above and press return to search.

మహేష్.. జక్కన్న ప్రాజెక్టు కంటే ముందు ఏం చేయబోతున్నాడంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ చూసుకొని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:30 AM GMT
మహేష్.. జక్కన్న ప్రాజెక్టు కంటే ముందు ఏం చేయబోతున్నాడంటే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ చూసుకొని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొద్ది రోజుల పాటు ప్రత్యేకంగా ట్రెక్కింగ్ శిక్షణతో పాటు ఫిట్ నెస్ విషయంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ రాజమౌళితో చేయబోయే సినిమాలో తన క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

జక్కన్న సినిమాలో మహేష్ బాబు వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ అంట. త్వరలో ఫారిన్ నుంచి మహేష్ బాబు ఇండియా తిరిగి రానున్నారంట. తరువాత అతను ఒప్పుకున్నా మూడు యాడ్స్ కి సంబందించిన కమర్షియల్ యాడ్ షూట్ లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ యాడ్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా జక్కన్న సినిమాపై ఫోకస్ చేయనున్నారంట. ఈ లోపు రాజమౌళి టీం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయడంతో పాటు ప్రీప్రొడక్షన్ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. ముందుగానే తన క్యారెక్టర్ కి సంబందించి సూపర్ స్టార్ మహేష్ బాబు అవగాహన పెంచుకోవడంతో పాటు రిహార్శల్స్ కూడా మొదలు పెట్టనున్నారంట.

ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ని మహేష్ బాబుకి జోడీగా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అలాగే దీపికా పదుకునేని ఓ కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడవనున్న నేపథ్యంలో హాలీవుడ్ కి చెందిన చాలా మంది యాక్టర్స్ ఈ చిత్రంలో నటిస్తారంట.

త్వరలో రాజమౌళి నుంచి ఈ మూవీకి సంబంధించి అన్ని వివరాలు బయటకి వచ్చే అవకాశం ఉంది. జక్కన్న సినిమా తర్వాత మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. తరువాత కమర్షియల్ సినిమాలు, డాన్స్ లు చేయడం కుదరదు. స్టోరీలు అన్ని కూడా లార్జర్ దెన్ లైఫ్ అనే విధంగా ఉంటాయి. దానిని దృష్టిలో ఉంచుకొని త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో డాన్స్ లు, మాస్ బీట్స్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా చేసినట్లు తెలుస్తోంది.