Begin typing your search above and press return to search.

ఫోన్ పే లో సూప‌ర్ స్టార్ స‌ర్ ప్రైజ్!

ఇప్పుడు ఎక్క‌డ ఫోన్ చేసినా పేమెంట్ ప్రాస‌స్ అంతా పూర్త‌యిన త‌ర్వాత థాంక్యూ బాస్ అంటూ మ‌హేష్ వాయిస్ వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 5:06 AM GMT
ఫోన్ పే లో సూప‌ర్ స్టార్ స‌ర్ ప్రైజ్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎండార్స్ మెంట్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌క‌ట‌న‌ల ద్వారా టాలీవుడ్ లోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరో. వార్షిక ఆదాయంలో సినిమాల‌కంటే బ్రాండింగ్స్ ద్వారానే ఎక్కువ అర్జిస్తున్నారు. ఈ విష‌యంలో మిగ‌తా హీరోల‌కు కూడా మ‌హేష్ ఇనిస్పేరేష‌న్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ‌చ్చ‌ని ఎలాంటి ప్ర‌క‌ట‌న విడిచిపెట్ట‌రు. అస‌వ‌ర‌మ‌నుకుంటే సినిమా షూటింగ్ సైతం ప‌క్క‌న‌బెట్టి ఎండార్స్ మెంట్స్ షూట్ ని ముందుగా ముగించేస్తుంటారు.

తాజాగా మ‌హేష్ ఖాతాలో పోన్ ఫే కూడా చేరిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎక్క‌డ ఫోన్ చేసినా పేమెంట్ ప్రాస‌స్ అంతా పూర్త‌యిన త‌ర్వాత థాంక్యూ బాస్ అంటూ మ‌హేష్ వాయిస్ వినిపిస్తుంది. దీంతో ఫోన్ పే ఖాతాని కూడా మ‌హేష్ ఎండార్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. వాస్త‌వానికి కంపెనీ ఇంకా మ‌హేష్ వాయిస్ ని ఖాతాకి అధికారికంగా అనుసంధానం చేయ‌లేదు. షూట్ స‌మ‌యంలోనే లీక్ అవ్వ‌డంతో ఏఐ టెక్నాల‌జీ దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ట్రైల్ లో భాగంగా మ‌హేష్ వాయిస్ ని మాత్రమే టెస్టింగ్ కోసం తీసుకున్నారు. ఇప్పుడా టెస్టింగ్ వాయిస్ ఫోన్ పేలో వినిపిస్తుంది. ఇక మ‌ల‌యాళం నుంచి మ‌మ్మ‌ట్టి ఈ యాడ్ కోసం ప‌నిచేసారు. అలాగే క‌న్న‌డ కోసం సుదీప్ వాయిస్ అందించారు. ఒకేసారి సౌత్ లో ముగ్గురు స్టార్ హీరోల‌తో ఫోన్ పే ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇది వినియోగ దారుల‌కు కొత్త అనుభూతిని పంచుతుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అమితాబ‌చ్చ‌న్ బాయిస్ వినిపించేది. గ‌త ఏడాది ఫోన్ ఫే కంపెనీ బాలీవుడ్ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ తో ఒప్పందం చేసుకుని ముందుకెళ్లింది. దీంతో అన్ని భాష‌ల్లోనూ ఆయ‌న వాయిస్ వినిపించింది. కానీ కొత్త ఏడాదిలో మాత్రం కొత్త స్టార్ల‌ను రంగంలోకి దించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏ షాప్ లో ఫోన్ పే చేసినా మ‌హేష్ వాయిస్ వినిపిస్తుంది. ఇదేంటి కొత్త‌గా ఉంది? అని వినియోగదారుడు స‌ర్ ప్రైజ్ అవుతున్నాడు. మ‌రి గాత్రాన్ని అందించ‌డం కోసం ఒక్కో స్టార్ ఎంత ఛార్జ్ చేసారో.