Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఇంట్లో అదే ప‌ని మీద ఉన్నాడే!

మ‌రి మ‌హేష్ ఇంట్లో ఖాళీ గా ఉండి ఏం చేస్తున్న‌ట్లు? అంటే ఉన్న స‌మ‌యాన్ని సినిమాల‌కే కేటాయించి న‌ట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   14 March 2024 4:30 AM GMT
మ‌హేష్ ఇంట్లో అదే ప‌ని మీద ఉన్నాడే!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇప్పుడు హైద‌రాబాద్ లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌ర్మ‌నీలో రాజ‌మౌళి సినిమాకి అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు. ఫ్యామిలీతో ఎలాంటి వె కేష‌న్లు కూడా ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. కొత్త సినిమా క‌థ‌లు విన‌డం..క‌మిట్ మెంట్ల గోల ఏదీ లేదు. ఎందుకంటే మూడేళ్లు రాజ‌మౌళి సినిమాతోనే స‌రిపోతుంది కాబ‌ట్టి ఆ గోల‌గోడ‌వ లేదు.

మ‌రి మ‌హేష్ ఇంట్లో ఖాళీ గా ఉండి ఏం చేస్తున్న‌ట్లు? అంటే ఉన్న స‌మ‌యాన్ని సినిమాల‌కే కేటాయించి న‌ట్లు తెలుస్తోంది. ఎంచ‌క్కా ఓటీటీలో హిట్ సినిమాల‌న్నింటిని చూస్తేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే హిందీ సినిమా ...అలియాభ‌ట్ నిర్మించిన చిత్రం పోచ‌ర్ చూసి త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. మ‌హేష్ ట్వీట్ ఆ సినిమాకి కోట్ల రూపాయల ప‌బ్లిసిటీని తెచ్చి పెట్టింది. ఇటీవ‌లే మ‌ల‌యాళం సినిమా ప్రేమ‌లు కూడా అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆ సినిమా కూడా చూసి సూప‌ర్ అని పొగిడేసారు. అంద‌రూ చూడాల్సిన సినిమా అంటూ `ప్రేమ‌లు` ని ఆకాశానికి ఎత్తేసారు. ఇలా ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేంత స‌మ‌యం మ‌హేష్ కి ఇంత‌వ‌ర‌కూ ఎప్పుడూ దొర‌క‌లేదు. ఖాళీ స‌మ‌యం ఉంటే వెకేష‌న్ కి వెళ్లిపోవ‌డం..లేదంటే షూటింగ్ లో ఉండ‌టం త‌ప్ప రోజుల త‌ర‌బ‌డి ఇంట్లో ఖాళీగా ఉండ‌రు. కానీ ఇప్పుడు రాజ‌మౌళి సినిమా ఉండ‌టంతో ఆయ‌నకు అందుబాటులో ఉండాల్సిన స‌మ‌యం ఇది.

అందుకే హైద‌రాబాద్ లోనే ఉన్నారు. త్వ‌ర‌లోనే సినిమాకి సంబంధించిన వ‌ర్క్ షాప్స్ ప్రారంభం అవుతాయి. వ‌ర్క్ షాప్ బిజీలో ప‌డితే మ‌ళ్లీ స‌మ‌యం ఉండ‌దు. అక్క‌డ నుంచి రాజ‌మౌళి ప‌రుగులు పెట్టిస్తారు. ఆయ‌న‌తో షూట్ అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. షూటింగ్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి ముగించే వ‌ర‌కూ ఆయ‌న్ని అంటి పెట్టుకునే ఉండాలి. డే అండ్ నైట్ షూట్ ఉంటుంది. కాబ‌ట్టి మ‌హేష్ ఎంజాయ్ చేయాల్సింది ఈ గ్యాప్ లోనే.