Begin typing your search above and press return to search.

మ‌హేష్ కెరీర్ లో ఫ‌స్ట్ హాఫ్ లేదుట!

ఓ సంద‌ర్భంలో ఆయ‌న ఏమ‌న్నారంటే?...'కెరీర్ ప్రారంభించిన కొత్త‌లో నా సినిమాలు పెద్ద‌గా ఆడేవి కాదు. దానికి తోడు కృష్ణ‌గారి అబ్బాయి అనే పేరు వ‌ల్ల ఒత్తిడి ఉండేది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 12:30 PM GMT
మ‌హేష్ కెరీర్ లో ఫ‌స్ట్ హాఫ్ లేదుట!
X

మ‌హేష్ బాల న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టి సూపర్ స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ ని చిన్న వ‌య‌సులోనే తండ్రి కృష్ణ సినిమాలు అల‌వాటు చేయ‌డంతో! అదే వృత్తిగా ఎంచుకుని సూప‌ర్ స్టార్ అయ్యారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. బాల న‌టుడిగా ఎన్నో సినిమాలు చేసారు. అటుపై 1999లో 'రాజ‌కుమారుడు'తో హీరోగా ప‌రిచ‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ ఒక్క‌డు వ‌ర‌కూ నాలుగైదు సినిమాలు చేసాడు.

కానీ అవేవి మ‌హేష్ ని స్టార్ గా మార్చ‌లేక‌పోయాయి. 'ఒక్క‌డు' స‌క్సెస్ తోనే మ‌హేష్ స్టార్ అయ్యాడు. అటుపై మ‌హేష్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ స్టార్ గా మారాడు. ఇలా మ‌హేష్ కెరీర్ రెండు రకాలుగా సినిమా జీవితం అన్న‌ది ప్ర‌ధ‌మార్ధం...ద్వితియార్ధంగా విభిజించి చూస్తే! మ‌హేష్ చాలా అసంతృప్తిగా క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆయ‌న మాట‌ల ద్వారా అర్ద‌మ వుతోంది.

ఓ సంద‌ర్భంలో ఆయ‌న ఏమ‌న్నారంటే?...'కెరీర్ ప్రారంభించిన కొత్త‌లో నా సినిమాలు పెద్ద‌గా ఆడేవి కాదు. దానికి తోడు కృష్ణ‌గారి అబ్బాయి అనే పేరు వ‌ల్ల ఒత్తిడి ఉండేది. పారితోషికంగా గురించి ఆలోచించ కుండా సినిమాలు చేసేవాడిని. చెప్పాలంటే నా కెరీర్ లో ఫ‌స్ట్ హాఫ్ అనేది లేదు. 'ఒక్క‌డు' త‌ర్వాత అన్ని మారిపోయాయి. ధైర్యం వ‌చ్చింది. ఆత్మ విశ్వాసం పెరిగింది' అని అన్నారు.

ఆయ‌న మాట‌ల ద్వారానే ప్ర‌థ‌మార్ధం విష‌యంలో ఆయ‌న ఎంత అసంతృప్తిగా ఉన్నారు అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. ఇక ద్వితియా ర్ధంలో ఆయ‌న ఏ రేంజ్ కి చేరుకున్నారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. రాజ‌మౌళి సినిమాతో 2024 లో పాన్ ఇండియా సినిమా మొద‌లు పెట్ట‌బోతున్నారు. అది రిలీజ్ అయిన త‌ర్వాత పాన్ ఇండియాని దాటి గ్లోబ‌ల్ స్టార్ అవ్వ‌డం లాంఛ‌న‌మే.