Begin typing your search above and press return to search.

మహేష్ న్యూ లుక్.. హ్యాండ్సమ్ రారాజు

తాజాగా హలో లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ తో అక్టోబర్ ఎడిషన్ రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 6:37 AM GMT
మహేష్ న్యూ లుక్.. హ్యాండ్సమ్ రారాజు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియాలోనే మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండియాలో అత్యధికంగా ఎండార్స్మెంట్ లు చేసే యాక్టర్ గా మహేష్ బాబు ఉన్నారు. ఈ కమర్షియల్ యాడ్స్ తో సూపర్ స్టార్ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అతని బ్రాండ్ వేల్యూతో దేశంలో టాప్ 10లో సెలబ్రెటీలలో ఒకడిగా ఉన్నాడు.


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఓ వైపు ఈ సినిమా చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు. అలాగే మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. లైఫ్ స్టైల్ మ్యాగజైన్స్ కవర్ పేజీపై ఎక్కువ సార్లు కనిపించిన స్టార్ గా సౌత్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు.

తాజాగా హలో లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ తో అక్టోబర్ ఎడిషన్ రిలీజ్ అయ్యింది. ఈ లుక్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, ఫ్యాషన్ ఐకాన్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చాలా వైబ్రెంట్ గా ఉండటం విశేషం. సింపుల్ గా ఉన్న స్టైలింగ్ లో మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి.

ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాగజైన్ కవర్ పేజీపై సూపర్ స్టార్ ఆఫ్ సదరన్ సినిమా ఇన్ హిజ్ ఓన్ ప్రయివేట్ కింగ్ డమ్ అంటూ క్యాప్షన్ ఉంది. ఈ క్యాప్షన్ తో మహేష్ బాబు ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. హ్యాండ్సమ్ రారాజు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

దీని తర్వాత జక్కన్న దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా చాలా సమయం పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ లో కమర్షియల్ యాడ్స్ పైన సూపర్ స్టార్ ఎక్కువ దృష్టి పెట్టనున్నారు.