Begin typing your search above and press return to search.

అమెరికా స్టోరీతో మహేష్ మేనల్లుడు

ప్రస్తుతం అశోక్.. దేవకీ నందన వాసుదేవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2024 12:49 PM GMT
అమెరికా స్టోరీతో మహేష్ మేనల్లుడు
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో అశోక్ గల్లా. ఫస్ట్ మూవీ హీరోతో కథానాయకుడిగా మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అశోక్.. దేవకీ నందన వాసుదేవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ సినిమాలో అశోక్ గల్లా.. మాస్ అవతార్ లో కనిపించనున్నట్లు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ హీరో కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో తన మూడో చిత్రం కోసం చేతులు కలిపారు అశోక్ గల్లా. సితార బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నేడు అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్.. ఈ సినిమాను ప్రకటించారు.

యంగ్ టాలెంటెడ్ అశోక్ గల్లాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. కలలు, వాస్తవాలు మధ్య చిక్కుకున్న యువకుల కథ అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రేమ, హాస్యం మేళవింపుతో ప్రస్తుత యువత మెచ్చే అందమైన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ స్టోరీ అంతా అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది.

ఈ సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా మ్యాడ్ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. ఇటీవల లవర్ మూవీలో తన యాక్టింగ్ కు గాను ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాతో ఉద్భవ్.. టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా రూపొందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న అగ్ర సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. యువతకు మెచ్చే అంశాలతోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుద్దని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా.. అశోక్ గల్లాకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.