Begin typing your search above and press return to search.

రాజమౌళి తర్వాత మహేష్ కి అతనే పర్ఫెక్ట్ ఆప్షన్..!

గుంటూరు కారమే తన ప్రాంతీయ సినిమా ఇక మీదట అన్నీ పాన్ ఇండియా సినిమాలే అంటూ గుంటూరు కారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు

By:  Tupaki Desk   |   6 Feb 2024 3:00 AM GMT
రాజమౌళి తర్వాత మహేష్ కి అతనే పర్ఫెక్ట్ ఆప్షన్..!
X

గుంటూరు కారమే తన ప్రాంతీయ సినిమా ఇక మీదట అన్నీ పాన్ ఇండియా సినిమాలే అంటూ గుంటూరు కారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు. దాని అర్థం గుంటూరు కారం సినిమా ఒక్కటే తాను తెలుగులో తీసే సినిమా ఆ తర్వాత రాజమౌళి సినిమా నుంచి పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలే అని హింట్ ఇచ్చేశాడు. అనుకున్నట్టుగానే రాజమౌళితో మహేష్ చేయబోతున్న సినిమా ఊహించిన దానికన్నా చాలా పెద్దగా రాబోతుందని అర్థమవుతుంది.

ఈ సినిమాకు చిత్ర యూనిట్ ప్రిపరేషన్స్ చూస్తుంటేనే నెక్స్ట్ బిగ్ థింగ్ అనేలా ఉంది. మహేష్ ఈ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. రాజమౌళి కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ని గ్లోబల్ వైడ్ చాటి చెప్పేలా కథ కథనాలను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలాగు రాజమౌళి డైరెక్షన్ కాబట్టి పక్కా హిట్టు టార్గెట్ అని చెప్పొచ్చు. ఐతే ఈ సినిమా తర్వాత మహేష్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనే చర్చ ఫ్యాన్స్ లో ఇప్పుడే మొదలైంది.

రాజమౌళి సినిమా తర్వాత ఎలాగు పాన్ ఇండియా రేసులో ఉంటాడు కాబట్టి నేషనల్ స్థాయిలో ఆడియన్స్ ని అలరించే డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలి. ఆ లిస్ట్ లో సుకుమార్, సందీప్ వంగ ప్రస్తుతానికి ఈ ఇద్దరు తెలుగు దర్శకులే ఉన్నారు. ఆల్రెడీ సుకుమార్ తో మహేష్ సినిమా చేశాడు కాబట్టి నెక్స్ట్ సందీప్ వంగతో అయితేనే బాగుంటుంది.

సందీప్ వంగ సినిమాల విధ్వంసం తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ రీసెంట్ గా యానిమల్ ఈ సినిమాల రిజల్ట్ తోనే కాదు సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ తో కూడా సందీప్ వంగ భయపెడుతున్నాడు. నెక్స్ట్ అతను స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కు పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే సందీప్ వంగానే అని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల మెటీరియలైజ్ అవ్వలేదు. మరి ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యేలా ఉన్నారు. సందీప్ వంగ లాంటి స్ట్రాంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మహేష్ ఒక మెటల్ మాస్ పాత్రలో నటిస్తే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.