Begin typing your search above and press return to search.

మహేష్ - కొరటాల కాంబో.. మరో బిగ్ రికార్డ్

ఈ సినిమాకి యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఏ సినిమాకి రాని వ్యూస్ ఈ చిత్రానికి వచ్చింది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:43 AM GMT
మహేష్ - కొరటాల కాంబో.. మరో బిగ్ రికార్డ్
X

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు క్లాస్, మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కేవలం థియేటర్ లో కనపడితే చాలు ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతారు. మహేష్ చివరగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బోల్తా కొట్టింది.

అయితే, గుంటూరు కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ, ఏవేవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురౌతున్నారు. అలా నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఇప్పుడు సూపర్ న్యూస్ తెలిసింది. మహేష్ బాబు నటింని ఓ సినిమా రికార్డు సృష్టించింది. ఈ వార్త విని ప్రస్తుతం ఫ్యాన్స్ ఆనందంతో గంతులు వేస్తున్నారు.

మహేష్ బాబు హీరోగా, కొరాటల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాని ఎవరూ మర్చిపోరు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మిర్చి తర్వాత కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా కళ్లార్పకుండా చూసేవారు ఉన్నారు. కాగా, ఈ మూవీతోనే మహేష్ ఇప్పుడు రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఏ సినిమాకి రాని వ్యూస్ ఈ చిత్రానికి వచ్చింది.

మొట్ట మొదటి సారిగా ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఎవర్ రికార్డు సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే సినిమా, ఊహించని విధంగా ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. దీనితో తెలుగు వెర్షన్ నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ ఉన్న సినిమాగా ఇది ఒకటే నిలిచింది.

అయితే ఈ స్థాయిలో రెస్పాన్స్ మాములుగా తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ చిత్రాలకి యూట్యూబ్ నుంచి ఉంటాయి. కానీ అలాంటిది ఒక్క తెలుగు వెర్షన్ నుంచే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.