Begin typing your search above and press return to search.

ఇంకా మహేష్ ఎందుకు రాలేదంటే..

ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

By:  Tupaki Desk   |   14 April 2024 10:34 AM GMT
ఇంకా మహేష్ ఎందుకు రాలేదంటే..
X

ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. మూవీ రిజల్ట్ పై మహేష్ బాబు వర్రీ అవ్వకుండా రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ పైన పూర్తిగా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ మూవీలో క్యారెక్టర్ కోసం మహేష్ బాబు కొత్త లుక్ ని ట్రై చేస్తున్నారు. అలాగే ఫిట్ న్యూస్ పై దృష్టిపెట్టారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మేకోవర్ కోసం ఎక్కువగా విదేశాలు వెళ్తూ ఉంటారు. అలాగే ఏదైనా సినిమా కంప్లీట్ అయ్యాక ఫ్యామిలీతో మహేష్ బాబు యూరప్ ట్రిప్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని కుటుంబంతో హ్యాపీ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. రీసెంట్ గా కూడా మహేష్ ఫ్యామిలీతో లాంగ్ వీకెండ్ గడిపాడు. రెగ్యులర్ గా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలని కూడా సోషల్ మీడియాలో నమ్రతా, మహేష్ బాబు షేర్ చేస్తూ వస్తున్నారు.

అక్కడకి ఫ్యామిలీతో వెళ్ళేటపుడు ఉండటానికి మహేష్ బాబు సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశారని గతంలో ప్రచారం నడిచింది. ఇదిలా ఉంటే కుటుంబంతో కలిసి యూరప్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ ఇంకా ఇండియాకి తిరిగి రాలేదు. భార్య, కుమార్తె, కొడుకు తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా యూరప్ లోనే ఉన్నారంట.

SSMB 29 సినిమాలో క్యారెక్టరైజేషన్ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారంట. ఈ మూవీ కోసం లాంగ్ హెయిర్ పెంచేసి ఒక న్యూ లుక్ గెడ్డంతో మహేష్ బాబు కనిపిస్తాడంట. ఇప్పటి వరకు ఏ సినిమాలో లేని లుక్ ని జక్కన్నతో చేయబోయే సినిమాలో మహేష్ బాబు చూపించబోతున్నాడు అని తెలుస్తోంది.అందుకే నిపుణుల పర్యవేక్షణలో మహేష్ శిక్షణ తీసుకుంటున్నారు.

మరికొద్ది రోజుల పాటు మహేష్ బాబు యూరప్ లోనే ఉంటారని తెలుస్తోంది. అందుకు కారణం మహేష్ లుక్ ఎక్కడ లీక్ అవ్వకూడదని రాజమౌళి ముందే సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే మహేష్ తో రాజమౌళి కలుసుకొని లుక్ పై కొన్ని ఫొటో సెషన్స్ నిర్వహించనున్నారు.

ఫైనల్ లుక్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. అందుకే మహేష్ చాలా జాగ్రత్తలు తీసికుంటున్నాడు. ఒకవేళ మహేష్ ఇండియాకు వచ్చినా కూడా లుక్ లీక్ అవ్వకుండా సైలెంట్ గా కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో సినిమాకి సంబందించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖరులో మూవీ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా గ్లోబల్ ప్రాజెక్ట్ గానే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.