Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ జ్ఞాప‌కార్దం మ‌హేష్ మ‌రో పౌండేష‌న్!

సూప‌ర్ స్టార్ మ‌హేషే సేవాదృక్ఫ‌ధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్నారుల‌కు ఉచిత గుండె అప‌రేష న్ల‌కు ఏటా కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:42 AM GMT
సూప‌ర్ స్టార్ జ్ఞాప‌కార్దం మ‌హేష్ మ‌రో పౌండేష‌న్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేషే సేవాదృక్ఫ‌ధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్నారుల‌కు ఉచిత గుండె అప‌రేష న్ల‌కు ఏటా కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నారు. ఎంబీ పౌండేష‌న్ ద్వారా ఎంతో మంది చిన్నారుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అయ్యే వైద్యాన్ని మ‌హేష్ పౌండేష‌న్ ద్వారా అందిం చారు. ఆ సేవ‌లు నిరంత‌రం కొన‌సాగుతూనే ఉంటాయి. అలాగే స్వ‌గ్రామం బుర్రిపాలెంని ద‌త్త‌త తీసుకుని ఆగ్రామానికి ఎన్నో ర‌కాల వ‌సుతులు క‌ల్పించారు.

స్వ‌గ్రామభివృద్దిని చూడాల‌ని కాంక్షించి మ‌హేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదంతా మీడియాకి తెలిసి చేస్తోన్న స‌హాయం. ఇంకా ఆయ‌న ఎంతో మందికి ఎన్నో ర‌కాలుగా స‌హాయ ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మా ల‌న్నింటిని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. మహేష్ బాట‌లోనే ముద్దుల కుమార్తె సితార కూడా ఎంతో దాతృ హృద‌యం గ‌ల‌ది. జ్యూవెల‌రీ యాడ్ చేసినందుకు అందుకున్న పారితోషికాన్ని విరాళంగా కేటాయించింది. నాయ‌న‌మ్మ జ్ఞాప‌కార్దం ముస‌లి అవ్వ‌ల‌కు చేత‌నైనా స‌హాయం చేసింది.

తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ తొలి వ‌ర్దంతిని పుర‌స్క‌రించుకుని మ‌హేష్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాప‌కార్దం ఎడ్యుకేషనల్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు.పేద పిల్లలకు స్కాలర్ షిప్ అందిస్తూ ఉచితంగా విద్యను సైతం అందించ‌బోతున్నారు. 40 మంది పేద విద్యార్దుల‌కు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించేవ‌ర‌కూ ఆ ఖ‌ర్చు..బాధ్య‌తలు మొత్తం ఎడ్యుకేష‌న్ సొసైటీ చూసుకుంటుంది.

ఈ సంద‌ర్భంగా త‌మ పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ అందిస్తున్నందుకు మ‌హేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసారు. మ‌హేష్ సార్ గ‌ర్వ‌ప‌డేలా ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటామ‌ని ప్రామిస్ చేసారు. ఈ పౌండేష‌న్ పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని చేయాల‌ని..ఆ దేవుడు ఆశ‌క్తులు ఎల్ల‌వెళ‌లా అందించాల‌ని అభిమానులు..నెటి జ‌నులు కోరుకుంటున్నారు.