Begin typing your search above and press return to search.

25 ఏళ్ల కెరీర్‌, 28 సినిమాల్లో మహేష్‌ ఫేవరెట్‌ ఇవే..!

సదరు మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. తన సినిమాల్లో మురారి, పోకిరి మరియు శ్రీమంతుడు సినిమాలంటే అమితమైన ఇష్టం.

By:  Tupaki Desk   |   5 March 2024 6:30 PM GMT
25 ఏళ్ల కెరీర్‌, 28 సినిమాల్లో మహేష్‌ ఫేవరెట్‌ ఇవే..!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పాతిక సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు ఆయన నుంచి హీరోగా 28 సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల గురించి మాట్లాడాడు.

సదరు మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. తన సినిమాల్లో మురారి, పోకిరి మరియు శ్రీమంతుడు సినిమాలంటే అమితమైన ఇష్టం. ఆ మూడు సినిమాలు దేనికి అదే అన్నట్టుగా చాలా విభిన్నంగా ఉంటాయి. ఆ సినిమాల్లో తన పాత్రలు బాగుంటాయని కూడా మహేష్ బాబు పేర్కొన్నాడు.

ఆ మూడు సినిమాలు కూడా కమర్షియల్‌ గా భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా పోకిరి సినిమా తెలుగు సినిమా స్థాయిని మార్చేసింది, ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ అనడంలో సందేహం లేదు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో పోకిరి సినిమా వచ్చింది. మహేష్ బాబు ను పోలీస్‌ ఆఫీసర్ గా ప్రేక్షకులు పోకిరి లో చూడటం జరిగింది.

ఇక మురారి సినిమా లో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాను చూపించడం జరిగింది. ఇక శ్రీమంతుడు సినిమాలో సోషల్‌ మెసేజ్ ను చూపించారు. మొత్తంగా ఈ మూడు సినిమాలను తన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ అని చెప్పడం ద్వారా మహేష్ బాబు టేస్ట్‌ ఏంటో చెప్పకనే చెప్పాడు.

25 ఏళ్ల సినీ కెరీర్‌ లో ఇంకా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మహేష్ బాబు నటించాడు. ఆయన నటించిన కమర్షియల్‌ ఫ్లాప్స్ సినిమాలు అతడు, ఖలేజా లు కూడా ఎంతో మందికి ఆల్‌ టైమ్‌ ఫేవరెట్. అలా మీకు మహేష్ బాబు కెరీర్‌ లో నటించిన సినిమాల్లో ఏది ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌...?