ఫోటో స్టోరి: మహేష్‌ని ప్రేమించింది పాపం!
టాలీవుడ్ ఫిట్టెస్ట్ హీరోల్లో మహేష్ బాబు పేరు చార్ట్ లో ఉంది. వయసు 49కి చేరువైనా ఇస్మార్ట్ లుక్ విషయంలో మహేష్ ఎక్కడా తగ్గడు
By: Tupaki Desk | 3 Dec 2023 7:21 AMటాలీవుడ్ ఫిట్టెస్ట్ హీరోల్లో మహేష్ బాబు పేరు చార్ట్ లో ఉంది. వయసు 49కి చేరువైనా ఇస్మార్ట్ లుక్ విషయంలో మహేష్ ఎక్కడా తగ్గడు. ఇప్పటికీ పాతిక ప్రాయం ఫిజిక్ ని మెయింటెయిన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తున్న మహేష్ బాబు తదుపరి రాజమౌళితో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తాడు. అదే క్రమంలో తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి తీవ్రమైన జిమ్ సెషన్‌కు విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం తన లుక్ ని అతడు పూర్తిగా మార్చేయబోతున్నాడని టాక్ ఉంది. ఈ ఆదివారం నాడు విశ్రాంతి లేకుండా, తన వ్యాయమ సెషన్ నుంచి ఫోటోలు షేర్ చేసారు. అవన్నీ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతున్నాయి.
ఆసక్తికరంగా ఈ ఫోటోల డంప్ లో ఓ ఫోటో ఎంతో ఆసక్తిని కలిగించింది. మహేష్ జిమ్ లో చెమటలు చిందిస్తుంటే, అతడినే చూస్తూ పక్కనే ఉన్న పెంపుడు కుక్క స్నూపీ అమాయకంగా కనిపించింది. ఈ ఫోటోలు త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానుల నుండి ఈ ఫోటోపై ఉత్సాహభరితమైన వ్యాఖ్యలు దూసుకువచ్చాయి. మహేష్‌ని ప్రేమించింది పాపం! అంటూ ఆ పప్పీ ఆరాధనపై ఒక అభిమాని సరదాగా కామెంట్ చేసాడు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం12 జనవరి 2024న థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి బరిలో విక్టరీ సాధించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారు. తదుపరి గ్లోబల్ సెన్సేషన్ ఎస్ఎస్ రాజమౌళితో కాకుండా మహేష్ బాబు వేరొక సినిమా కోసం సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.