Begin typing your search above and press return to search.

జక్కన్న కోసం మహేష్.. ఎన్నేళ్ళు?

రెండు భాగాలుగా అంటే బాహుబలి సిరీస్ కోసం ఎంత టైం తీసుకున్నారో అంతే స్థాయిలో ఈ మూవీకి కూడా తీసుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 March 2024 6:07 AM GMT
జక్కన్న కోసం మహేష్.. ఎన్నేళ్ళు?
X

రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతోనే హాలీవుడ్ లెజెండరీ దర్శకులని జక్కన్న మెప్పించారు.

అలాగే ఆస్కార్ రేసులో కూడా నిలబడి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డుని నాటునాటు పాటకి గాను అందుకున్నారు. ఈ కారణంగా సూపర్ స్టార్ తో చేయబోయే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. జక్కన్న కూడా ఈ అంచనాలని అందుకోవడానికి పక్కా ప్లానింగ్ తోనే మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కథ సిద్ధం చేశారు.

సినిమా రెండు భాగాలుగా ఈ చిత్రం ఉండే అవకాశం ఉందని గతంలో విజయేంద్రప్రసాద్ చెప్పారు. రెండు భాగాలుగా అంటే బాహుబలి సిరీస్ కోసం ఎంత టైం తీసుకున్నారో అంతే స్థాయిలో ఈ మూవీకి కూడా తీసుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే మహేష్ బాబు ఫారిన్ లో జక్కన్న సినిమాలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నాడు అనే ప్రచారం నడుస్తోంది.

త్వరలో మూవీ వర్క్ షాప్ స్టార్ట్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అలాగే మహేష్ బాబుకి జోడీగా హాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా ఖరారు చేశారని, కీలక పాత్రల కోసం హాలీవుడ్ నటులని ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నారని కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా సూపర్ స్టార్ నుంచి ఐదేళ్ల సమయాన్ని తీసుకుంటున్నారంట.

రెండు పార్ట్స్ కి కలిపి ఐదేళ్ల సమయం కేటాయించడానికి మహేష్ బాబు కూడా ఇప్పటికే ఒప్పుకున్నారని తెలుస్తోంది. బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ కూడా ఏకంగా ఐదేళ్ల సమయం కేటాయించారు. తరువాత ఆర్ఆర్ఆర్ మూవీ కోసం తారక్, రామ్ చరణ్ మూడేళ్ళ టైం జక్కన్నకి ఇచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ కోసం ఐదేళ్ల సమయాన్ని రాజమౌళికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి భాగం సినిమా 2026 లో లేదా 2027 లో రావచ్చు. ఇక మరో భాగం 2029 లో రిలీజ్ కావచ్చు. మొత్తంగా జక్కన్న కోసం 5 ఏళ్ళ టైమ్ ఇస్తున్న మహేష్ మరో సినిమా వచ్చేసరికి 2030 దాటే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.