Begin typing your search above and press return to search.

ఫేవరెట్ థియేటర్ లో మహేశ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

తాజాగా గుంటూరు కారం మూవీని చూసేందుకు సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కు మహేశ్ తన సతీమణి నమ్రతతో కలిసి వచ్చారు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 10:49 AM GMT
ఫేవరెట్ థియేటర్ లో మహేశ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
X

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మరో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. భారీ అంచనాల నడుమ నేడే థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో మహేశ్.. ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్‌ లో సందడి చేసి ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు.


ఇక మహేశ్ సినిమా రిలీజ్ అంటే నైజాంలో ఏ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహేశ్ బాబు ఫేవరెట్ థియేటర్.. హైదరాబాద్ లోని ఆర్టీస్టీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ లో భారీ స్థాయిలో వేడుకలను నిర్వహిస్తారు ఫ్యాన్స్. ఆ సెలబ్రేషన్స్ చూడడానికి మహేశ్ బాబు ఫ్యామిలీ కూడా పలు మూవీ రిలీజ్‌లకు అక్కడికి వచ్చి అభిమానులతో సినిమా ఎంజాయ్ చేస్తుంటారు.


తాజాగా గుంటూరు కారం మూవీని చూసేందుకు సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కు మహేశ్ తన సతీమణి నమ్రతతో కలిసి వచ్చారు. వీరితోపాటు దర్శకుడు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌, దిల్‌ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నమ్రత సిస్టర్‌ కూడా ఉన్నారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు.


ఇక థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాక అభిమానులకు మహేశ్ బాబు అభివాదం చేసి కాసేపు ఖుషీ చేశారు. తనదైన మేనరిజంతో థియేటర్ లో ఆకట్టుకున్నారు. అభిమానులు మధ్య సినిమా చూస్తూ వాళ్ల నుంచి వచ్చే కిక్‌ ను ఆస్వాదించారు. థియేటర్లో తమ అభిమాన హీరోను చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సందడి చేశారు. ఈలలు వేస్తూ గోల చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

సినిమా విషయానికి వస్తే.. మహేశ్ బాబు వన్ మ్యాన్ షోతో కథను నడిపించినట్లు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ సరదాగా ఎంటర్టైన్ గా సాగిన కథ, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో మహేశ్ ఘాటు చూపించి.. ఎమోషన్స్ తో కన్నీళ్లు తెప్పించాలని చెబుతున్నారు. ఇక డాన్స్‌ విషయంలో మహేశ్ లో ఇప్పటివరకు చూడని ఎనర్జీ ఈ మూవీలో కనిపిస్తుందట. సినిమాలో మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయట.