Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబు నిక‌ర‌ ఆస్తుల విలువ‌?

'గుంటూరు కారం' తర్వాత సూపర్ స్టార్ మ‌హేష్ బాబు SS రాజమౌళి చిత్రం కోసం ముంద‌స్తు ప్రిపరేష‌న్ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 March 2024 6:15 PM GMT
మ‌హేష్ బాబు నిక‌ర‌ ఆస్తుల విలువ‌?
X

'గుంటూరు కారం' తర్వాత సూపర్ స్టార్ మ‌హేష్ బాబు SS రాజమౌళి చిత్రం కోసం ముంద‌స్తు ప్రిపరేష‌న్ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టులో ఈ సినిమా ప్రారంభం కానుంది. దీని కోసం అతడు దాదాపు 125 కోట్లు వసూలు చేస్తున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే మ‌హేష్ న‌టించిన మొదటి చిత్రం 'రాజ‌కుమారుడు'కి కేవలం 75 లక్షలు మాత్రమే పారితోషికంగా అందుకున్నాడు. టాలీవుడ్ లో అగ్ర హీరో హోదాను అందుకుని, కెరీర్ లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌తో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌హేష్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు.

1999లో రాజకుమారుడు సినిమాతో అరంగేట్రం చేసి ఓవ‌ర్ నైట్ స్టార్ గా ఖ్యాతిని పొందిన మ‌హేష్ ఆ త‌ర్వాత కొన్ని వ‌రుస ఫ్లాపుల‌ను చూసాడు. మ‌ళ్లీ పోకిరి, మురారి, ఒక్క‌డు లాంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాల‌తో అత‌డు అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్నాడు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, గుంటూరు కారం ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన సినిమాలు. ఇవ‌న్నీ అత‌డికి విజ‌యాల్ని అందించాయి.

అయితే రెండు ద‌శాబ్ధాలు పైగా సాగించిన కెరీర్ లో మ‌హేష్ ఎంత ఆస్తిని కూడ‌గ‌ట్టాడు? అంటే దానికి తాజాగా స‌మాచారం ల‌భించింది. మ‌హేష్ ఒక్కో సినిమాకి 30 కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. ఇటీవ‌ల ఆల్మోస్ట్ పారితోషికం డ‌బుల్ చేసాడు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల రూపంలోను అత‌డు కోట్లాది రూపాయ‌ల కాంట్రాక్టుల‌ను కుదుర్చుకుంటున్నాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో మహేష్ బాబు ప్రస్తుతం దాదాపు 300 కోట్ల నికర ఆస్తుల‌ను కలిగి ఉన్నాడని అంచ‌నా. ఇది 2005లో అతని ఆస్తి విలువతో పోలిస్తే నేటి నిక‌ర ఆస్తి విలువ‌ 4900 శాతానికి పెరిగింద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన కుటుంబం నుండి దాదాపు 48 కోట్లను వారసత్వంగా పొందాడు.

2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అతడు' ఫ్లాప్ అయినా ఈ చిత్రం కోసం 5 కోట్లు అందుకున్నాడ‌ని టాక్ ఉంది. అప్ప‌టికి అత‌డు స్వ‌యంగా సంపాదించిన‌ సంప‌ద‌ల‌ నికర విలువ సుమారు 6 - 8 కోట్లుగా ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం గ‌డిచిన‌ 18 సంవత్సరాలలో 4900 శాతం పెరిగింది. ప్ర‌స్తుతం మ‌హేష్ ఆస్తుల విలువ 300 కోట్లు.

మ‌హేష్ కి హైదరాబాద్ ఫిలింన‌గ‌ర్‌లో విశాలమైన బంగ్లా ఉంది. దాని విలువ దాదాపు 30 కోట్లు. అతడికి బెంగళూరులోను మ‌రో బంగ్లా ఉంది. ముంబైలోను ఆస్తులున్నాయ‌ని క‌థ‌నాలున్నాయి. అత్యంత విలువైన ప్రైవేట్ జెట్ .. విలాసవంతమైన వానిటీ వ్యాన్.. ఖ‌రీదైన కార్ల‌ను క‌లిగి ఉన్నాడు. మ‌హేష్‌ తన భార్య నమ్రతా శిరోద్కర్ పేరు మీద AN రెస్టారెంట్ అనే రెస్టారెంట్ చైన్‌ను కూడా ర‌న్ చేస్తున్నారు. ఇక‌పోతే మ‌హేష్ కి వార‌స‌త్వంగా వ‌చ్చే ఆస్తులు వేరు. తండ్రి నుంచి అత‌డికి కొన్ని ఆస్తులు వ‌చ్చాయి. అలాగే ఏఎంబీ మాల్ పేరుతో మ‌ల్టీప్లెక్స్ రంగంలోను మ‌హేష్ రాణిస్తున్నాడు. థియేట్రిక‌ల్ చైన్ వ్యాపారం నుంచి కూడా భారీగా ఆదాయం ఆర్జిస్తున్నాడు.

మహేష్ బాబు వార్షిక ఆదాయం ప్రాజెక్ట్‌లను బట్టి సంవత్సరానికి దాదాపు 120 - 150 కోట్లు సంపాదిస్తాడు. ఇటీవ‌ల విడుద‌లైన‌ గుంటూరు కారం కోసం దాదాపు 75 కోట్లు వసూలు చేశాడు. 2020లో అతడి నికర ఆస్తి విలువ 220 కోట్లు ఉంటుందని అంచనా. 2015లో ఆయన ఆస్తుల విలువ 90 కోట్లు. 2010లో దాదాపు 50 కోట్లు. 2005లో 6 కోట్లుగా ఉన్న సంపాద‌న‌.. అప్ప‌టి నుంచి 2023 నాటికి 300 కోట్లకు చేరింద‌ని చెబుతున్నారు. త‌దుప‌రి రాజ‌మౌళితో భారీ చిత్రంలో న‌టిస్తున్న మ‌హేష్ కి 125 కోట్ల పారితోషికం అందుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అంటే 2024-25 నాటికి 400 కోట్లు అంత‌కుమించిన నిక‌ర విలువ అత‌డి సొంతమ‌వుతుంది.