Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాకి ముందే మ‌హేష్ మ‌రో ఎలివేష‌న్!

ఇట‌వలే పోన్ ఫే చేస్తుంటే చివ‌ర్లో థాంక్యూ బాస్ అంటూ అభిమానుకు ఎలా క‌నెక్ట్ అయ్యాడో చూసాం.

By:  Tupaki Desk   |   10 March 2024 10:33 AM GMT
పాన్ ఇండియాకి ముందే మ‌హేష్ మ‌రో ఎలివేష‌న్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్రాండింగ్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యాడ్స్ చేయ‌డంలో ఆయ‌న త‌గ్గేదేలే అని ప్ర‌త్యేకంగా చెప్పాలా? త‌న వ‌ర‌కూ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందంటే దాన్ని వ‌దిలే ఛాన్సే లేదు. ఎలాగో డీల్ కుదుర్చుకుని కంపెనీ చేజార‌కుండా క‌మిట్ అవుతుంటారు. ఇట‌వలే పోన్ ఫే చేస్తుంటే చివ‌ర్లో థాంక్యూ బాస్ అంటూ అభిమానుకు ఎలా క‌నెక్ట్ అయ్యాడో చూసాం. దీంతో మ‌హేష్ ఖాతాలో మ‌రో సంస్థ ప‌డింద‌ని అర్ధ‌మైంది.

తాజాగా ఓ శీత‌ల పానియం యాడ్ షూట్ లో పాల్గొన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పంచుకున్నారు. ఇందులో మ‌హేష్ మ‌రోసారి ఇర‌గ‌దీసాడ‌నొచ్చు. శీత‌ల పానియం కోసం యాక్ష‌న్ అద‌ర‌గొట్టేసాడు. రియ‌ల్ స్టంట్స్ ని త‌ల‌పించేలా మ‌హేష్ పై యాక్ష‌న్ సీన్ ఆక‌ట్టుకుంటుంది. అత‌డి హెయిర్ స్టైల్...యాక్ష‌న్ ఆఫ్ స్టైల్ తో మ‌హేష్ మ‌రోసారి త‌న బ్రాండ్ వేసేసాడు.

ఈ యాడ్ లో మ‌హేష్ స్నేహితుడు కోసం చేసి పోరాటం చేసాడు. ఇదే కంపెనీ కోసం మ‌హేష్ ఇప్ప‌టికే రెండు యాడ్లు చేసాడు. కానీ వాటికి భిన్నంగా స్టైలిష్ ఈ యాడ్ షూట్ చేయ‌డం విశేషం. ఈ వీడియో నేరుగా మ‌హేష్ షేర్ చేయ‌డంతో నెట్టింట వైర‌ల్ గా మారింది. న‌ట‌న‌తో పాటు ఈ ర‌క‌మైన ప్ర‌చారం కోసం మ‌హేష్ ఛార్జ్ చేసి ఉండొచ్చు. ప్ర‌స్తుతం మ‌హేష్ పాన్ ఇండియా సినిమా కోసం స‌న్న‌ధం అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే జ‌ర్మనీ లో సినిమాకి అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చాడు. రాజ‌మౌళి ఎప్పుడు పిలిస్తే అప్పుడు సై అంటూ దూసుకుపోవ‌డానికి సిద్దంగా ఉన్నాడు. సినిమాకి సంబంధించి అవ‌స‌ర‌మైన వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హించాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే కొద్ది రోజులుగా ఆ ప‌నులే జ‌రుగుతు న్నాయి. ఈనెల‌ఖ‌రుకు ఆ ప‌నులు ఓ కొలిక్కి రావొచ్చని స‌మాచారం.