Begin typing your search above and press return to search.

రాజమౌళి కంటే ముందు మళ్ళీ ఆ డైరెక్టర్ తో మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసింది

By:  Tupaki Desk   |   7 March 2024 10:52 AM GMT
రాజమౌళి కంటే ముందు మళ్ళీ ఆ డైరెక్టర్ తో మహేష్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసింది. మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా రాజమౌళి కెరీర్ లో కూడా ఈ ప్రాజెక్టు అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రాబోతోంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరు చూడనటువంటి సినిమాను రాజమౌళి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

అసలైతే ఈపాటికి సినిమా పనులు మొదలు కావాలి కానీ స్క్రిప్ట్ పనులు కాస్త ఎక్కువ టైమ్ తీసుకోవడం వలన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఆలస్యం అయ్యింది. ఇక రాజమౌళి సినిమా మొదలైతే మాత్రం మహేష్ బాబు ఇతర పనులకు చాలావరకు దూరంగానే ఉంటాడు. అంతేకాకుండా తన లుక్ విషయంలో కూడా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు అని చెప్పవచ్చు.

ప్రస్తుతం లుక్ విషయంలోనే చర్చలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి కంటే ముందే మహేష్ కొన్ని కమర్షియల్ యాడ్స్ లో పాల్గొంటున్నాడు. గత రెండు మూడు నెలల్లోనే మూడు రకాల యాడ్ షూట్ లలో పాల్గొన్న మహేష్ ఇప్పుడు మరొక కొత్త యాడ్ షూట్ పాల్గొన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక రోజు యాడ్ షూట్ కొనసాగినట్లు సమాచారం.

ఇంతకుముందే మహేష్ బాబు అనిల్ తో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విధంగా సక్సెస్ అయితే అందుకుంది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు ఈ దర్శకుడితో మహేష్ ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఇక మహేష్ రాజమౌళి ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత కొంతకాలం ఈ యాడ్ షూట్స్ కు కూడా బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.

కాబట్టి ఇప్పట్లో చివరి యాడ్ షూట్ ఇదే అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక రాజమౌళి ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లుక్ విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అంతేకాకుండా మహేష్ వర్క్ షాప్ లో కూడా పాల్గొనాలి. ఇక సినిమా మాత్రం వచ్చే ఏడాది రాకపోవచ్చు 2026 లోనే విడుదల చేయవచ్చని టాక్.