Begin typing your search above and press return to search.

మీరే నాకు అమ్మా.. నాన్న.. మహేష్ ఎమోషనల్

గుంటూరు వేదికగా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 5:13 PM GMT
మీరే నాకు అమ్మా.. నాన్న.. మహేష్ ఎమోషనల్
X

గుంటూరు వేదికగా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక వేడుకలో మహేష్ సరదాగా మొదలైన స్పీచ్ ఎమోషనల్ వర్డ్స్ తో ముగిసింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే.

మహేష్ బాబు మాట్లాడుతూ.. ఫంక్షన్ ను గుంటూరులో జరుపుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. ఇది ఆయన ఐడియానే. అయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్ లాగా.. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను.

ఇంట్లో మనుషుల గురించి మనం ఎక్కువగా ఏం మాట్లాడతాం. కానీ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినా కూడా ఆ పర్ఫామెన్స్ లో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. అతడు, ఖలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది.. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. ఇవన్నీ గుండెల్లో నుంచి వస్తున్న మాటలు. ఐ లవ్ యు త్రివిక్రమ్ సార్.

మా నిర్మాత చిన్న బాబు గారి మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఈ విషయం ఆయన చెప్పలేదు. నాకు తెలిసింది. సీన్స్ చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూశా. ఒక ప్రొడ్యూసర్ కళ్ళల్లో ఆనందం కలిగినప్పుడు ఆ ఫీలింగ్ వేరు. ఆయన ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక శ్రీలీల గురించి మాట్లాడాలి అంటే చాలా కాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మంచి హార్డ్ వర్కింగ్ నటి. ఆ అమ్మాయికి సీన్ ఉన్నా లేకపోయినా సెట్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది.

ఈ అమ్మాయితో డాన్స్ చేయడం మాములు విషయం కాదు. వామ్మో అదేవి డాన్స్.. హీరోలు అందరికీ తాటా ఊడిపోద్ది. ఆమెతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆమె కెరీర్ ఇంకా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరో హీరోయిన్ మీనాక్షి మా సినిమాలో ఒక గెస్ట్ అప్పిరియన్స్ చేసింది. నేను త్రివిక్రమ్ గారు అడగగానే ఏమీ ఆలోచించకుండా ఒకే చెప్పేసింది. అందుకు ఆమెకు చాలా థాంక్స్ చెబుతున్నాను.

థమన్ గురించి చెప్పాలి. తమన్న అంటే నాకు చాలా ఇష్టం. నాకు బ్రదర్ లాగా. అతను సినిమాకు చాలా బెస్ట్ వర్క్ చేస్తాడు. కుర్చీ మడత పెట్టి అనే పాట నేను త్రివిక్రమ్ గారు.. ఇలా చేద్దాం అని అడగగానే ఆలోచించకుండా మాకు ట్యూన్ రెడీ చేసి ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా 10 డిస్కషన్ లో పెట్టేవాడు. మీరు ఆ పాట థియేటర్లో చూస్తే దద్దరిల్లిపోతుంది. థాంక్యూ థమన్. ఇందాక ఏవి చూసినప్పుడు 25 కెరీర్ సంవత్సరాలు పూర్తయింది అనగానే నాకు అర్థం కాలేదు.

ఇన్ని సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది. అందరికీ థాంక్యూ సో మచ్. మాటల్లేవ్.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా చేతిలో ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ తెలియదు అని. ఎప్పుడూ కూడా నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ. నాకు గాని నాన్నగారికి గాని మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టర్. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాము.

కానీ ఈసారి ఎందుకో కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డుల గురించి కలెక్షన్స్ గురించి చెబుతూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. అయితే ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి. నాకు. ఇకనుంచి మీరే నాకు అమ్మ.. మీరే నాకు నాన్న.. మీరే నాకు అన్ని.. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను.. అంటూ మహేష్ బాబు చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.