Begin typing your search above and press return to search.

హిట్ ఫ్రాంచైజ్ లో మహేష్ కూడానా..?

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ సినిమాలు చేశాడు

By:  Tupaki Desk   |   2 Jan 2024 9:30 AM GMT
హిట్ ఫ్రాంచైజ్ లో మహేష్ కూడానా..?
X

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ సినిమాలు చేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ని అలరించాయి. హిట్ ఫ్రాంచైజ్ లను దాదాపు 7 సినిమాలుగా తీయాలని గట్టి ప్లానింగ్ తోనే ఉన్నాడు నాని. శైలేష్ ఇప్పటికే ఆ సినిమాల లైన్ లు రాసి పెట్టుకుని ఉన్నాడట. అయితే హిట్ 1 లో విశ్వక్ సేన్, హిట్ 2 లో అడివి శేష్ నటించగా హిట్ 3 లో నాని భాగం అవుతున్నాడు. హిట్ 3 కోసం నాని ఒక 3 నెలలు డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని హిట్ 3 కోసం టైం కేటాయించాల్సి ఉంది.

ఇదిలా ఉంటే హిట్ 4, 5, 6, 7 సినిమాల్లో స్టార్స్ కూడా భాగం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా శైలేష్ తో ఆల్రెడీ సైంధవ్ సినిమా చేసిన విక్టరీ వెంకటేష్ హిట్ ఫ్రాంచైజ్ లో నటిస్తాడని టాక్. వెంకటేష్ తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ కూడా హిట్ ఫ్రాంచైజ్ లో నటిస్తాడని అంటున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో క్రైం థ్రిల్లర్ కథలో పవర్ పోలీస్ గా నటిస్తే ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా థ్రిల్ అనిపిస్తుంది. అందుకే హిట్ ఫ్రాంచైజ్ లో మహేష్ ని కూడా ఒక హీరోగా చేయాలని శైలేష్ ప్లాన్ చేస్తున్నాడట.

అయితే హిట్ ఫ్రాంచైజ్ సినిమాలన్నీ లిమిటెడ్ బడ్జెట్ తో చేస్తున్నారు. మహేష్ తో అంటే సినిమా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ పైన ఉంటుంది. అది సాధ్యమవుతుందా అన్నది డౌటే.. అదిగాక నాని నిర్మాతగా అంత భారీ బడ్జెట్ సినిమా చేస్తాడా అన్నది డౌట్ అని చెప్పొచ్చు. నాని తో పాటుగా ఆ సినిమాలో మహేష్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అయితే తప్పకుండా ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ఇంతకీ మహేష్ హిట్ ఫ్రాంచైజ్ లో నటిస్తాడా అంటే శైలేష్ కథ బాగా రాసుకుంటే ప్రయోగం చేసేందుకు సూపర్ స్టార్ కూడా రెడీ అంటాడు కాబట్టి కచ్చితంగా ఒప్పుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

హిట్ చివరి సినిమాలో హిట్ 1 నుంచి 6 వరకు నటించిన హీరోలంతా కూడా కనిపిస్తారని. అది పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రైం థ్రిల్లర్ సినిమా అవుతుందని అంటున్నారు. మరి చివరి భాగమే మహేష్ తో చేస్తారా లేదా మధ్యలో ఏదైనా సినిమా మహేష్ తో ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా హిట్ ఫ్రాంచైజ్ లో మహేష్ సినిమా అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.