Begin typing your search above and press return to search.

మహేష్ 'యానిమల్‌' అదిరి పోయింది అంతే...!

మొత్తానికి మహేష్‌ మేనియా కారణంగా యానిమల్‌ ప్రీ రిలీజ్ వేడుక అదిరి పోయింది అంతే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 7:25 AM GMT
మహేష్ యానిమల్‌ అదిరి పోయింది అంతే...!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్‌ గా రూపొందిన యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. హిందీలో రూపొందినా కూడా తెలుగులో సినిమాకు ఉన్న క్రేజ్‌ చూస్తే పిచ్చెక్కి పోతుందని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

సందీప్ వంగ దర్శకత్వం వహించడంతో పాటు నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న నటించడం వల్ల తెలుగు ప్రేక్షకులు యానిమల్‌ ను ఓన్‌ చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. తాజాగా మల్లారెడ్డి యూనివర్శిటీలో జరిగిన యానిమల్‌ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హిట్‌ అయిన తీరు చూస్తే బాలీవుడ్ వారికి కూడా మతిపోవడం ఖాయం.

యానిమల్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మహేష్‌ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. స్టేజ్ పై మహేష్ బాబు మాట్లాడితేనే గొప్ప విషయం. అలాంటిది రెండు మూమెంట్స్ చేయడంతో పాటు, సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాడు. మొత్తానికి మహేష్‌ మేనియా కారణంగా యానిమల్‌ ప్రీ రిలీజ్ వేడుక అదిరి పోయింది అంతే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

టైర్‌ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ ఉన్న ఈ సమయంలో ఇంత క్రేజ్‌, స్టార్‌ డమ్ ఉన్న మహేష్ బాబు మాత్రం పెద్దగా పాన్‌ ఇండియా అనే కాన్సెప్ట్‌ ను నమ్మడం లేదు. తాను ఏ సినిమా చేసినా కూడా తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ లను కొల్లగొట్టే విధంగా ఉండేలా చూస్తున్నాడు.

అలాంటి మహేష్ బాబు ఈసారి వద్దు అనుకున్నా కూడా రాజమౌళి తో చేయబోతున్న సినిమా పాన్‌ ఇండియా కాదు పాన్ వరల్డ్‌ అయ్యేలా ఉంది. రాజమౌళికి ఉన్న క్రేజ్‌, మహేష్ బాబుకి ఉన్న స్టార్‌ ఫాలోయింగ్ తో వీరి కాంబో మూవీ గత రికార్డులను తూడ్చి పెట్టడం ఖాయం అంటున్నారు.

యానిమల్‌ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో రణబీర్‌ కపూర్‌ మాట్లాడుతూ మహేష్ గురించి చేసిన వ్యాఖ్యలు, ఇతరులు మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్‌ తో ఆయన స్థాయి మరింత పెరిగింది అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు ఈ ఈవెంట్‌ లో కనిపించిన సందర్భంగా వేసుకున్న ఔట్‌ ఫిట్ గురించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది.

ఎంత సింపుల్ గా మహేష్ బాబు ఈ భారీ ఈవెంట్‌ కి వచ్చాడో చూసి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక భారీ రాజకీయ సభ ను తలపించే విధంగా యానిమల్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి జనాలు హాజరు అయ్యారు. ఆ జనాలను చూసి బాలీవుడ్‌ మీడియాతో పాటు బాలీవుడ్‌ వర్గాల వారు అవాక్కయ్యి ఉంటారు.