Begin typing your search above and press return to search.

మహేష్ - రాజమౌళి.. ప్లాన్ ఓకే కానీ..

దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:30 PM GMT
మహేష్ - రాజమౌళి.. ప్లాన్ ఓకే కానీ..
X

దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే మూవీ స్టోరీ సిద్ధం అవుతోంది. విజయేంద్రప్రసాద్ తమ టీంతో కలిసి కథపై కసరత్తు చేస్తున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ దశకి వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని రాజమౌళి ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.

ఈ మూవీలో మహేష్ బాబు వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా కనిపిస్తాడని, అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చేశారు. అలాగే హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తారని చెప్పారు. దీంతో సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం సూపర్ స్టార్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం పూర్తి చేసే పనిలో ఉన్నారు.

వచ్చే ఏడాది ఆరంభంలో జక్కన్న మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అలాగే క్యాస్టింగ్ సెలక్షన్స్, స్టోరీబోర్డు, లొకేషన్స్ సెర్చింగ్ అన్ని కూడా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో స్టార్ట్ చేయనున్నారంట. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత వేగంగా స్టార్ట్ చేసి 2025లో మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్.

ఈ చిత్రాన్ని 2025లో మధ్యలో గాని ఎండింగ్ లోగాని రిలీజ్ కి సిద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే రాజమౌళి సినిమా మొదలు పెట్టిన తర్వాత ఎప్పటికి పూర్తవుతుందనేది ఎవరూ చెప్పలేరు. ప్రతి సీన్, ప్రతిషాట్ లో పెర్ఫెక్షన్ కోసం జక్కన్న ప్రయత్నం చేస్తాడు. బడ్జెట్ పెరిగిన కూడా వెనక్కి తగ్గరు. ఇలాంటి పరిస్థితి లో 2025 రిలీజ్ సాధ్యమేనా అనే డౌట్ వస్తోంది.

2027కి రిలీజ్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. రాజమౌళి గత సినిమాలు బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఒక్కొక్కటి మూడేళ్లకు చేశారు. అలాంటిది పాన్ వరల్డ్ రేంజ్ లో చేస్తోన్న మహేష్ బాబు మూవీని ఏడాదిలో కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారంటే నమ్మలేమని అంటున్నారు. మరి జక్కన్న ప్లానింగ్ ఎలా ఉంటుందో, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో అనేది మూవీ లాంచింగ్ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.