Begin typing your search above and press return to search.

ప్రెండ్స్ గ్యాంగ్ తో మ‌హేష్-న‌మ్ర‌త చిలౌట్!

ఇక టాలీవుడ్ లో స్నేహితుల‌తోనే అంతే స‌ర‌దాగా క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్..తార‌క్. .వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి పార్టీలు చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 10:38 AM GMT
ప్రెండ్స్ గ్యాంగ్ తో మ‌హేష్-న‌మ్ర‌త చిలౌట్!
X

ఒక‌ప్పుడు రిజ‌ర్వ‌ర్డ్ గా ఉండే మ‌హేష్ ఇప్పుడా మూడ్ నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. న‌మ్ర‌త తెచ్చినా మార్పా? మ‌హేష్ లోనే క‌లిగిందా? అన్న‌ది తెలియ‌దు గానీ ఇప్పుడు మ‌హేష్ ఇప్పుడు చిలౌట్ అవ్వ‌డంలో మాత్రం మాములుగా ఉండటం లేదు. ఇప్ప‌టికే వెకేష‌న్లు వెళ్ల‌డంలో మ‌హేష్ ఫ్యామిలీ కి ఓ రికార్డు ఉంది. దాన్ని బ్రేక్ చేయ‌డం టాలీవుడ్ లో ఏ జోడీ వ‌ల్ల కాదు. ఇదే విష‌యాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం అన్నారు


ఇక టాలీవుడ్ లో స్నేహితుల‌తోనే అంతే స‌ర‌దాగా క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్..తార‌క్. .వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి పార్టీలు చేసుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు గెట్ టూ గెద‌ర్ లు ఏర్పాటు చేసుకుం టున్నారు. వాటిలో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇటీవ‌లే దీపావ‌ళి సంద‌ర్భంగా వివిధ పార్టీల‌కు మ‌హేష్ స‌తీస‌మేతంగా హాజరైన సంగ‌తి తెలిసిందే. ఎంత మంది హీరోలున్నా? మ‌హేష్ ఉంటే ఆ క‌ళే వేరుగా ఉంటుంద‌ని ఆ పార్టీల‌కు సూప‌ర్ స్టార్ వ‌న్నే తీసుకొచ్చారు


తాజాగా న‌మ్ర‌త‌-మ‌హేష్ జోడీ త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు బ‌య ట‌కు వ‌చ్చాయి. అందులో చాలా మంది లేడీ ప్రెండ్స్ ఉండ‌గా కొంత‌మంది మేల్స్ ఉన్నారు. ప్ర‌త్యేకంగా ఒక స్నేహితుడికి ఏకంగా మ‌హేష్‌చాక్లెట్ కేక్ తినిపిస్తూ క‌నిపించారు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ పార్టీకి మ‌హేష్ హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. న‌మ్ర‌త‌తో క‌లిసి లేడీ గ్యాంగ్ అంతా ఒక ఫోటో దిగారు.


ఈ వెంట్ ఓ పెద్ద స్టార్ హోట‌ల్ లో నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ `గుంటూరు కారం`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ కి బ్రేక్ ఇవ్వ‌డంతో మ‌హేష్ ఇలా పండ‌గ‌లు..పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు. 2024 నుంచి మ‌హేష్ కి ఇలా పార్టీల‌కు వెళ్లే స‌మ‌యం అస్స‌లుండ‌దు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌పంచాన్నే షేక్ చేసే ప్రాజెక్ట్ తో వ‌స్తున్నారు కాబ‌ట్టి త్యాగం త‌ప్ప‌దు.