Begin typing your search above and press return to search.

మహేష్ సలహాతో హిట్ కొట్టిన ప్రభాస్

ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథని ఏవో కారణాలతో మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:55 AM GMT
మహేష్ సలహాతో హిట్ కొట్టిన ప్రభాస్
X

ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథని ఏవో కారణాలతో మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్ కారణంగా కథ నచ్చిన సెట్ అవ్వదు అనుకుంటే వేరొక హీరోకి సజిస్ట్ చేస్తారు. అలా కథలని సజిస్ట్ చేసే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. తనకి సెట్ కాదనుకున్న కథలకి ఎవరైతే సరిపోతారో చెప్పడంతో పాటు వారికి సజిస్ట్ చేసే అలవాటు ఉంది.

మహేష్ బాబుకి కథల మీద మంచి జడ్జిమెంట్ ఉంటుంది. అతని కెరియర్ లో గత కొన్నేళ్ళ నుంచి ఎక్కువ సక్సెస్ లే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ దగ్గరకి వెళ్ళిన ఓ సినిమాని డార్లింగ్ ప్రభాస్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా ప్రభాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ పెంచింది. ఆ మూవీనే మిస్టర్ పెర్ఫెక్ట్. ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా మిస్టర్ పెర్ఫెక్ట్ కచ్చితంగా నిలుస్తుంది.

అయితే ఈ సినిమా కథని ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి దిల్ రాజు, దర్శకుడు దశరథ్ వినిపించారంట. దశరథ్ మహేష్ అయితే బాగుంటుందని అతనిని అప్రోచ్ అయ్యారు. కథ మొత్తం విన్న తర్వాత మహేష్ బాబుకి భాగా నచ్చిందంట. అయితే అందులో హీరో క్యారెక్టర్ కి నా కంటే ప్రభాస్ అయితే సెట్ అవుతాడని దిల్ రాజుకి సూచించారంట.

తరువాత మహేష్ బాబు కూడా ప్రభాస్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి కథ బాగుంటుందని, నీకు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పారంట. దిల్ రాజు, దశరథ్ ప్రభాస్ కి ఆ కథని చెప్పడం జరిగిపోయింది. ప్రభాస్ కి స్టొరీ భాగా నచ్చడంతో సెట్స్ పైకి తీసుకెళ్ళారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్స్ గా నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపడిన ఈ కథ అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

అలా ప్రభాస్ ఖాతాలో మహేష్ బాబు కారణంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది. రీసెంట్ గా బుచ్చిబాబు తారక్ కోసం రెడీ చేసుకున్న కథని ఆయన సలహాతో రామ్ చరణ్ కి వినిపించి ఒకే చేయించుకున్నారు. ఈ మూవీ 2024లో సెట్స్ పైకి వెళ్లనుంది