Begin typing your search above and press return to search.

SSMB 29లో మహేష్ క్యారెక్టర్.. ఏం ప్లాన్ రా బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో క్రేజీ & భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jun 2025 6:17 PM IST
SSMB 29లో మహేష్ క్యారెక్టర్.. ఏం ప్లాన్ రా బాబు!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో క్రేజీ & భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ షూటింగ్ చకచకా సాగిపోతూనే ఉంది. అటవీ నేపథ్యంలో సాగే ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి కథగా మూవీ ఉండనుంది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. జులై రెండో వారంలో కెన్యాలో స్టార్ట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టోరీ రీత్యా, ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరగనున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కెన్యాలో కీలక షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్లు ప్రచారం జరిగినా, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు కెన్యా వెళ్లేందుకు టీమ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ నెల రోజుల పాటు జరగనున్న షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు ఛేజ్‌ సీక్వెన్స్‌ లు షూట్ చేయనున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకోసం మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వెళ్లనున్నట్లు.. ఇప్పటికే షూట్ కు పర్మిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సరికొత్త అవతార్ లో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు.

అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మహేష్ లుక్ మాత్రమే కాదు.. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయన రోల్ లో రెండు షేడ్స్ ఉంటాయట. ఫస్టాఫ్ అంతా మహేష్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని, సెకండాఫ్ లో సానుకూల లక్షణాలు కనిపిస్తాయని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ విషయం వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.

రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదని చెబుతున్నారు. ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాజమౌళి రూపొందిస్తున్నట్లు మరోసారి అర్థమవుతుందని అంటున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఆ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని జక్కన్న భావిస్తున్నట్లు టాక్.