Begin typing your search above and press return to search.

డైనోసర్‌తో ఫైట్.. అతిగా లేదూ?

రాజమౌళి సినిమాల్లో యాక్షన్ ఘట్టాలు ఎంత గొప్పగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

By:  Tupaki Desk   |   23 April 2025 3:01 PM IST
Mahesh Babu vs Dinosaur? Buzz Around Rajamoulis Next Big Action Scene
X

రాజమౌళి సినిమాల్లో యాక్షన్ ఘట్టాలు ఎంత గొప్పగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలో చేసిన మిడ్ రేంజ్ సినిమాల నుంచి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాల వరకు యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేయడంలో జక్కన్న ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. ‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీక్వెన్సులు చూసి అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

జేమ్స్ కామెరూన్ లెజెండరీ డైరెక్టర్లను కూడా అందులోని సన్నివేశాలు అబ్బురపరిచాయి. దీంతో ఆయన తర్వాతి చిత్రం కోసం ప్రపంచమంతా అమితాసక్తితో ఉంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోనూ అద్భుత యాక్షన్ ఘట్టాలు ఉంటాయని.. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వాటిని తీర్చిదిద్దబోతున్నారని చిత్ర వర్గాలు చెబుతాయి.

ఈ క్రమంలోనే మహేష్-రాజమౌళి సినిమాలోని ఒక యాక్షన్ ఘట్టం గురించి క్రేజీ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఇందులో డైనోసర్‌గా మహేష్ బాబు ఫైట్ చేస్తాడన్నది ఆ రూమర్ సారాంశం. ఈ కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడుస్తుందని.. హాలీవుడ్లో వచ్చిన అడ్వెంచరస్ సినిమాలను తలపిస్తుందని చిత్ర వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే డైనోసర్ ఫైట్ పెట్టారని అంటున్నారు. కానీ మహేష్.. డైనోసర్‌తో ఫైట్ చేయడం వినడానికి క్రేజీగా అనిపించినా, ఇది మరీ అతిగా ఉంటుందేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.

‘ఆర్ఆర్ఆర్’లో తారక్-పులి మధ్య ఫైట్ కొంచెం అతిశయంగా కనిపించింది. సహజంగా అనిపించలేదు. అలాంటిది జక్కన్న ఈసారి మహేష్‌కు, డైనోసర్‌కు మధ్య ఫైట్ పెట్టి ఎంత కన్విన్సింగ్‌గా తీస్తాడు అన్నది ప్రశ్నార్థకం. అసలు నిజంగా ఈ సీక్వెన్స్ సినిమాలో ఉందా.. ఊరికే సోషల్ మీడియా జనాలు ప్రచారం కూడా దీన్ని క్రియేట్ చేశారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. నిజంగా ఈ సీక్వెన్స్ ఉన్నట్లయితే.. త్వరలో రాజమౌళి అండ్ కో పెట్టబోయే ప్రెస్ మీట్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.