Begin typing your search above and press return to search.

అఖిల్- జైనాబ్ పెళ్లిలో మ‌హేష్ స్టైలిష్ లుక్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ ఛాలెంజింగ్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది అత‌డికి పాన్ ఇండియా (పాన్ వ‌ర‌ల్డ్) మార్కెట్లోకి దూసుకెళ్లే త‌రుణం.

By:  Tupaki Desk   |   9 Jun 2025 9:51 AM IST
Mahesh Babus Viral Look at Akhil-Zainab Reception
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ ఛాలెంజింగ్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది అత‌డికి పాన్ ఇండియా (పాన్ వ‌ర‌ల్డ్) మార్కెట్లోకి దూసుకెళ్లే త‌రుణం. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో అత‌డు SSMB 29 కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదైన లొకేష‌న్ల‌లో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇది ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రచారం సాగుతోంది. అలాగే సాంకేతికంగా ఈ చిత్రాన్ని మ‌రో లెవ‌ల్లో రూపొందించ‌నున్నార‌ని తెలుస్తోంది.


రాజ‌మౌళి ఈ మూవీ కోసం ఏకంగా రెండేళ్ల పాటు స‌మ‌యం కేటాయించి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌హేష్ అభిమానులు సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వ‌చ్చినా, త‌మ ఫేవ‌రెట్ ని ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించేందుకు రాజ‌మౌళి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల మూవీకి సంబంధించి మ‌హేష్ లుక్ ఎలా ఉంటుందో రివీలైంది. ఇప్పుడు మ‌రోసారి మహేష్ గెట‌ప్ లీకైంది.

తాజాగా హైదరాబాద్‌లో అఖిల్ అక్కినేని -జైనాబ్ రావ్‌జీల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మ‌హేష్ త‌న స‌తీమ‌ణి నమ్ర‌త‌, కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేనితో క‌లిసి కనిపించారు. సింపుల్ గా ఫుల్ హ్యాండ్ టీ-షర్ట్ ధరించి మ‌హేష్‌ స్టైలిష్‌గా కనిపించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. మ‌హేష్ వ‌య‌సు స‌గానికి స‌గం త‌గ్గిపోయింది! అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ లో నమ్రతా శిరోద్కర్, సితార ఘట్టమనేని, నాగార్జున, అమల అక్కినేని కూడా నూతన వధూవరులతో పోజులిచ్చారు.