Begin typing your search above and press return to search.

SSMB29 : పాట తర్వాత పాస్‌ పోర్ట్‌ వెనక్కి!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతోంది.

By:  Tupaki Desk   |   30 April 2025 10:03 AM
SSMB29 : పాట తర్వాత పాస్‌ పోర్ట్‌ వెనక్కి!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతోంది. కానీ ఇప్పటి వరకు సినిమా గురించి చిన్న అప్‌డేట్‌ కూడా అధికారికంగా రాజమౌళి కానీ, ఇతర యూనిట్‌ సభ్యులు కానీ ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై కీలక పాట చిత్రీకరణ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ పాట చిత్రీకరణకు రాజమౌళి దాదాపు వారం నుంచి పది రోజుల సమయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలోని పాటలు కూడా చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ పాట ఉంటుందని తెలుస్తోంది.

మహేష్ బాబుతో సినిమాను ప్రకటించే సమయంలో రాజమౌళి ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. సింహాన్ని బోనులో బంధించి పాస్ పోర్ట్‌ను స్వాదీనం చేసుకున్నట్లుగా ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియో బాగా వైరల్‌ అయింది. రాజమౌళి సినిమా పూర్తి అయ్యే వరకు మహేష్ బాబు హాలీడే ట్రిప్‌ అంటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి సినిమా అయితే ఏంటి అనుకున్నాడో ఏమో కానీ మహేష్ బాబు సమ్మర్‌ ట్రిప్‌కి రెడీ అయ్యాడు. మే మొదటి వారంలో మహేష్ బాబు హాలీడే ట్రిప్‌ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం SSMB 29 సినిమాకు సంబంధించిన పాట చివరి దశ షూటింగ్‌ జరుపుతున్నారు. అతి త్వరలోనే షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాట షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత దాదాపుగా 40 రోజుల పాటు చిత్రీకరణకు రాజమౌళి విరామం ప్రకటించారని తెలుస్తోంది. ఆ గ్యాప్‌లోనే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలీడే ట్రిప్‌ కి సిద్ధం అవుతున్నాడు. ప్రతి ఏడాది మహేష్ బాబు తన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్‌కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి సినిమా ఉన్న కారణంగా ఈ ఏడాది మహేష్‌ బాబు ఫ్యామిలీ ట్రిప్ ఉండక పోవచ్చు అనుకున్నారు. కానీ రాజమౌళి స్వయంగా సమ్మర్‌ హాలీడేస్ ఇవ్వడంతో మహేష్ బాబు హ్యాపీగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది.

గుంటూరు కారం సినిమా తర్వాత ఏడాది ఖాళీగానే ఉన్న మహేష్ బాబు తన లుక్‌ను చాలా మార్చుకున్నారు. రాజమౌళి సూచన మేరకు చాలా హెయిర్‌ స్టైల్స్‌ను ప్రయత్నించారు. చివరకు రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబును ఏ లుక్‌లో చూపిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే నెలలో కృష్ణ జయంతి ఉంటుంది. ఆ సమయంలో ఏమైనా సినిమ అప్‌డేట్‌ ఉంటుందేమో చూడాలి. సమ్మర్‌ హాలీడేస్‌ తర్వాత జూన్‌ రెండో వారంలో మళ్లీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో వారణాసి సెట్‌లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. విదేశీ షెడ్యూల్‌ సైతం ఉంటుందట. సినిమా షూటింగ్‌ ఈ ఏడాదిలోనూ పూర్తి చేసే విధంగా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. 2027లో సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.