Begin typing your search above and press return to search.

రాజమౌళి స్కెచ్ లో ఇరుక్కున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..?

SSMB 29 సినిమాకు పాన్ వరల్డ్ క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్స్ ని సైతం ఆశ్చర్యపరిచాడు. ఇక మహేష్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తాడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 12:02 PM IST
రాజమౌళి స్కెచ్ లో ఇరుక్కున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..?
X

స్టార్ హీరోల బర్త్ డేకి కచ్చితంగా వారు చేస్తున్న సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. సినిమా పూర్తైన విధానాన్ని బట్టి అప్డేట్స్ వస్తాయి. కనీసం ఒక పోస్టర్ అయినా వేసి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తారు. ఐతే రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న ఎస్.ఎస్.ఎం.బి 29 అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం జక్కన్న అలాంటి ప్లాన్స్ ఏమి చేయట్లేదని టాక్

రాజమౌళితో మహేష్..

తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకునేలా చేశాడు రాజమౌళి. ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే చాలు అంచనాలు తారాస్థాయిలో ఉంటున్నాయి. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాజమౌళి. ఆ సినిమా తర్వాత వస్తున్న మహేష్ సినిమాపై సూపర్ బజ్ ఉంది.

మహేష్ తో రాజమౌళి.. ఈ కాంబో ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాల్సింది కానీ ఇద్దరు కలిసి చేసే సినిమా కుదరలేదు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజమౌళితో మహేష్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రాజమౌళి సినిమా అంటేనే నెక్స్ట్ లెవెల్ బజ్ ఉంటుంది. అందులోనూ మహేష్ తో చేస్తున్నాడంటే ఇక అంచనాలకు మించి అనేస్తున్నారు.

SSMB 29 పాన్ వరల్డ్ క్రేజ్..

SSMB 29 సినిమాకు పాన్ వరల్డ్ క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్స్ ని సైతం ఆశ్చర్యపరిచాడు. ఇక మహేష్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తాడని అంటున్నారు.

ఐతే ఈ సినిమా నుంచి మహేష్ బర్త్ డేకి ఏదైనా టీజర్ వస్తుందని అనుకోగా రాజమౌళి అలాంటి ఆలోచన చేయట్లేదట. టీజర్ ఐతే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ లేదట. ఒకవెళ వస్తే పోస్టర్ ఏదైనా వస్తుందేమో అని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ఒక రేంజ్ లో ఉండగా.. రాజమౌళి మాత్రం ప్రమోషన్స్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడట. ఇప్పటి వరకు సినిమా గురించి ఎక్కడ డిస్కస్ చేయని రాజమౌళి సినిమా షూటింగ్ ని మాత్రం సైలెంట్ గా చేస్తున్నాడు.