షర్ట్ లేకుండా మహేష్ యాక్షన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ సినిమా ఇప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 8 May 2025 12:19 PMసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ సినిమా ఇప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత రాజమౌళి తన మార్క్ స్టైల్‌లో ఈ సినిమాను గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం కొత్త లుక్‌లో, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జోరుగా సాగుతోంది.
సినిమా కోసం మహేష్ బాబు తన ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. రాజమౌళి డిమాండ్ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కోసం అతను గత కొన్ని నెలలుగా రోజూ గంటల తరబడి వర్కవుట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌తో కలిసి రాజమౌళి భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు మహేష్ కెరీర్‌లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవనున్నాయని టాక్ నడుస్తోంది.
లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ అరుదైన యాక్షన్ ఘట్టం కోసం మహేష్ బాబు షర్ట్‌లెస్‌గా ఫైట్ చేసిన సన్నివేశం షూట్ చేశారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో మహేష్ చొక్కా విప్పి ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నాడట. ఈ ఫైట్ సీక్వెన్స్‌ను రాజమౌళి ఇప్పటికే పూర్తి చేశాడు. ఈ యాక్షన్ ఘట్టం మహేష్ కెరీర్‌లో బెస్ట్ ఫైట్ సీన్‌గా నిలుస్తుందని, అతని ఫిట్‌నెస్, ఎనర్జీ స్క్రీన్‌పై గూస్‌బంప్స్ తెప్పిస్తాయని టీమ్ సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటివరకు మహేష్ ఏ సినిమాలో కూడా షర్ట్ లేకుండా కనిపించ లేదు. కానీ ఈసారి జక్కన్న సినిమా కోసం నెవ్వర్ బిఫోర్ అనేలా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే వివిధ లొకేషన్స్‌లో జరుగుతోంది. రాజమౌళి ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు, ఇందులో మహేష్‌తో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం.
ఈ సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుందని అంటున్నారు. సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ డ్రామా, అడ్వెంచర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్. రాజమౌళి స్టైల్‌లో భారీ సెట్స్, హై-ఓక్టేన్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.