Begin typing your search above and press return to search.

రెండుసార్లు మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వచ్చిన చేయలేకపోయిన స్టార్ డైరెక్టర్...

'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీ రికార్డు లను బ్రేక్ చేసిన ఆయన వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడు.

By:  Tupaki Desk   |   21 Sept 2026 12:39 PM IST
రెండుసార్లు మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వచ్చిన చేయలేకపోయిన స్టార్ డైరెక్టర్...
X

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవ్వరికి సాధ్యంకానీ సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో మహేష్ బాబు ఒకరు. 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీ రికార్డు లను బ్రేక్ చేసిన ఆయన వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తో డిఫరెంట్ సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టి పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగిన శంకర్ సైతం మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెండుసార్లు ప్రయత్నించాడు కానీ అది వర్కౌట్ కాలేదు.

పోకిరి మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత శంకర్ ఒక లవ్ స్టోరీ ని మహేష్ బాబు కి వినిపించాడట. కానీ మహేష్ కి అది పెద్దగా నచ్చకపోవడం తో దాన్ని రిజెక్ట్ చేశాడనే వార్తలు వచ్చాయి. అలాగే '3 ఇడియట్స్' తెలుగు రీమేక్ ను సైతం లో మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబు కి రీమేక్ సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను కూడా రిజెక్ట్ చేశాడట. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడితో సినిమా అవకాశం వస్తే చాలని ఎదురుచూసే దర్శకులు ఉన్నారు. నిజానికి శంకర్ కి సైతం ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ ఉన్నప్పటికి మహేష్ బాబు మాత్రం తనకి కథ నచ్చితేనే సినిమా చేస్తానని చెప్పి ఆయన చెప్పే స్టోరీ ని విన్నాడట.

ఆ కథ మహేష్ ను ఇంప్రెస్ చేయకపోవడంతో దానిని ఆయన పెద్దగా పట్టించుకోలేదట. ఏది ఏమైనా కూడా శంకర్ డైరెక్షన్లో మహేష్ బాబు మూవీ చేస్తే బాగుండేదని అతని అభిమానులు కోరుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు. శంకర్ గత 10 సంవత్సరాల్లో ఒక్క సక్సెస్ ను కూడా సాధించలేదు. పెద్దగా ఫామ్ లో లేడు కాబట్టి ఆయనతో మహేష్ సినిమా చేసే అవకాశమైతే లేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు.

కాబట్టి ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మొత్తానికైతే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది...