మహేష్ రన్నింగ్ రోజుకు రెండు గంటలా!
విశ్వనటుడు కమల్ హాసన్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అంటే? ఆయన ఠక్కున చెప్పే సమాధానం రోజుకు 14 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం అంటారు.
By: Tupaki Desk | 29 Jun 2025 7:00 PM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అంటే? ఆయన ఠక్కున చెప్పే సమాధానం రోజుకు 14 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం అంటారు. జిమ్ లో వర్కౌట్లు, యోగా కంటే రన్నింగ్ మరింత మెరుగైన ఫలి తం ఇస్తుందని కమల్ నమ్మకం. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ అయినా? ఉదయం సాయంత్రం కలిపి 14 కిలోమీట్లర్లు రన్నింగ్ చేసేలా చూసుకుంటారు.
మరి సూపర్ స్టార్ మహేష్ పిట్ నెస్ , బ్యూటీ సీక్రెట్ ఏంటి? అంటే మహేష్ కూడా రన్నింగ్ ప్రియుడేనని తేలింది. మహేష్ కూడా రోజుకు రెండు గంటలు రన్నింగ్ మీదనే ఉంటారుట. ఉదయం గంట.. ..సాయంత్రం గంట క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తారుట. ఇంటి జిమ్ లో ఉన్న థ్రెడ్ మీల్ మీద చాలా వేగంగా పరిగె డుతారుట. జిమ్ లో వర్కౌట్లకు ముందే మహేష్ రన్నింగ్ పని పూర్తి చేస్తాడుట.
ఒక్కో రోజు వర్కౌట్లు చేయకపోయినా రన్నింగ్ మాత్రం మిస్ అవ్వడుట. ఈ విషయాన్ని ఆయన మ్యాకప్ మ్యాన్ పట్టాభి తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చేసినంత కాలం ఆయనకు మ్యాకప్ మెన్ పట్టాభినే. ఆయన అనంతరం మహేష్ కి కూడా తానే మ్యాకప్ మ్యాన్ గా మారారు. మహేష్ థ్రెడ్ మిల్లు మీద వేగంగా రన్నింగ్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇదే మహేష్ అసలు బ్యూటీ సీక్రెట్. దీంతో పాటు డైట్ ఫాలో అవుతుంటారు. ఉప్పు కారం..మసాల పుడ్ కు దూరంగా ఉంటారు. నీళ్లు ఎక్కువగా తీసుకుంటారు. నాగార్జున కూడా మంచి ఫిట్ నెస్ ప్రియుడు. ఫిట్ నెస్ విషయంలో చిరంజీవికి స్పూర్తి నాగార్జున. నాగార్జున ఉదయాన్నే క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు. ఇష్టమైన ఆహారాలన్నింటిని తింటారు. వాటర్ క్రమం తప్పకుండా తీసుకోవడం కింగ్ బ్యూటీ సీక్రెట్ గా చెబుతారు.
