యుఫోరియా.. మహేష్ ను నేనేం అడగలేదు: గుణశేఖర్
అయితే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు చేరలేదని ఆయన అంగీకరించారు. ధురంధర్ స్థాయి విజయాన్ని అందుకుంటుందని ఊహించినట్టు,
By: M Prashanth | 2 April 2026 9:20 AM ISTడైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యుఫోరియాపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందేశాత్మక అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఆ సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఆ మూవీ.. ఇప్పుడు ఈటీవీ విన్ లో ఏప్రిల్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
దీంతో మూవీ టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గుణశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యుఫోరియా సినిమా విషయంలో తనకు ఎంతో నమ్మకం ఉందని, భారీ కమర్షియల్ హిట్ అవుతుందని భావించినట్లు చెప్పారు. ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతో తన కుటుంబ సభ్యులకు కూడా అదే విషయాన్ని చెప్పానని తెలిపారు. తాను కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వ్యక్తినని, ఆ స్థాయినే యుఫోరియాలో కొనసాగించానని పేర్కొన్నారు.
అయితే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు చేరలేదని ఆయన అంగీకరించారు. ధురంధర్ స్థాయి విజయాన్ని అందుకుంటుందని ఊహించినట్టు,
యుఫోరియా నేషనల్ సబ్జెక్ట్ కాదని, అంతర్జాతీయ స్థాయి కథతో రూపొందించిన చిత్రం అని గుణశేఖర్ వివరించారు. ఈ క్రమంలో ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన అడల్సెన్స్ సిరీస్ ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి స్థాయి సెన్సేషన్ తన సినిమా కూడా సృష్టిస్తుందని ఆశించానని చెప్పారు.
అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన కెరీర్ లో ఎప్పుడూ ఎవరికీ సినిమా చూడమని అడగలేదని, యుఫోరియా విషయంలో కూడా అలాగే వ్యవహరించానని తెలిపారు. అయితే మహేష్ బాబు స్వయంగా సినిమా చూసి తనకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారని వెల్లడించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా ఉందని ఆయన అభినందించారని చెప్పారు.
అంత బిజీ షెడ్యూల్ లో సినిమా చూసి స్పందించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. సినిమా విడుదలైన రెండు రోజులకే మహేష్ బాబు చూసి ట్వీట్ చేయడం చేశారని గుణశేఖర్ తెలిపారు. ప్రేక్షకులకు సినిమా చేరాలని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రావాలని ఆయన చూపిన శ్రద్ధ తనను ఆకట్టుకుందని చెప్పారు. ఈ ఈవెంట్ కు పిలిస్తే కూడా యుఫోరియా గురించి మాట్లాడేందుకు మహేష్ సిద్ధంగా ఉన్నారని, అది తనకు చాలని పేర్కొన్నారు.
అయితే యుఫోరియా మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరే అవకాశం ఉందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ భాషల్లో ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గుణశేఖర్ వెల్లడించారు. మొత్తానికి.. థియేటర్లలో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన యుఫోరియా.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.
