Begin typing your search above and press return to search.

వారణాసి.. ఈసారి అక్కడ అంతకుమించి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Dec 2025 10:30 AM IST
వారణాసి.. ఈసారి అక్కడ అంతకుమించి..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం అటు సినీ ప్రియులు.. ఇటు మహేష్, జక్కన్న అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. 2027లో థియేటర్స్ లో చిత్రం విడుదల కానుంది. సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వనుంది. అయితే గ్లోబల్ స్థాయిలో వారణాసి థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్న సంగతి విదితమే. 100కు పైగా దేశాల్లో మూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది!

అయితే అది ఒకేసారి అన్ని దేశాల్లో విడుదల చేస్తారా.. లేకుండా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తారా అన్న విషయంపై స్పష్టత లేదు. అదే సమయంలో జపాన్ లో కూడా వారణాసి గ్రాండ్ గా విడుదల అవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఐమ్యాక్స్ జపాన్ తన సోషల్ మీడియాలో పరోక్షంగా తెలిపింది.

రీసెంట్ గా వారణాసి గ్లింప్స్ ను షేర్ చేసింది. 2027లో రిలీజ్ అంటూ రాసుకొచ్చింది. దీంతో జపాన్ లో పెద్ద ఎత్తున సినిమా విడుదలవుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇప్పటికే జక్కన్న దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్.. జపాన్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే.

అప్పుడు కాస్త లేట్ గా అక్కడ రిలీజ్ అయినప్పటికీ.. జపాన్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు జపాన్ రిలీజ్ లో ఎలాంటి లేట్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారని వినికిడి. దీంతో ఆర్ఆర్ఆర్ కు మించిన రేంజ్ లో వారణాసి.. జపాన్ లో రిలీజవ్వనుందన్న మాట!

ఇప్పటికే అక్కడ రాజమౌళికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉండగా.. వారణాసి కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను కచ్చితంగా అందుకుంటుందనే చెప్పాలి. అదే సమయంలో మేకర్స్.. ప్రమోషనల్ కంటెంట్ తో ముందే మంచి బజ్ ను క్రియేట్ చేయాలనే ప్లాన్ లో కూడా ఉన్నారట. ఏదేమైనా జక్కన్న గ్లోబల్ ప్లాన్ భారీ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వారణాసి సినిమా విషయానికొస్తే.. మహేష్ బాబుతో పాటు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.