వారణాసికి ఆర్ఆర్ఆర్ స్ట్రాటజీ సరిపోదా?
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `వారణాసి`. రజామౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
By: Ravindar Gorantla | 9 April 2026 7:21 PM ISTసూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `వారణాసి`. రజామౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో స్టార్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న జక్కన్న `ఆర్ఆర్ఆర్` తరువాత చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీపై నెట్టింట రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో చేస్తున్నారని కొంత మంది అంటుంటే రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నభూతో న భవిష్యతి అనే స్థాయిలో జక్కన్న తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేఫథ్యంలోనే భారతీయ సినిమాల్లో అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇదని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేయడం, ఈ మూవీకి వీఎఫ్ ఎక్స్ వర్క్ చేస్తున్న సంస్థ తన వెబ్ సైట్‌లో `వారణాసి` స్టోరీని రివీల్ చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీవీపై ఆసక్తి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇంతకు ముందు `ఆర్ ఆర్ ఆర్` మూవీ ప్రమోషన్స్‌తో పాటు మార్కెటింగ్ కోసం జక్కన్న సరికొత్త స్ట్రాటజీని ఫాలో కావడం, సినిమాని వరల్డ్ వైడ్‌గా వైరల్ చేయడం తెలిసిందే. అంతే స్థాయిలో మార్కెటింగ్ చేసిన జక్కన్న అనుకున్న విధంగా భారీ స్థాయి వసూళ్లని మాత్రం రాబట్టలేకపోయాడు. వరల్డ్ వైడ్‌గా `ఆర్ఆర్ఆర్` రూ.1300 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని దక్కించుకున్నా కానీ రికార్డు స్థాయిలో అనుకున్న విధంగా మాత్రం వసూళ్లని రాబట్టలేకపోయింది.
అయితే ఇప్పుడ `వారణాసి`కి ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం కష్టమని జక్కన్నభావిస్తున్నాడట. దానికి ప్రధాన కారణం రణ్‌వీర్ సింగ్ `ధురంధర్ 2`. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా గ్లోబల్ జియో పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1637 కోట్లు రాబట్టింది. రానున్న రోజుల్లో రూ.2000 కోట్ల మార్కుని దాటుతుందా? అనే చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా - పాక్‌ల మధ్య ఉన్న వైరం అందరికి తెలిసిందే. ఈ అంశానికి ఇండియన్ స్పైల స్టోరీని జోడించి చెప్పినా రూ.2000 కోట్ల మార్కుని చేరుకోలేకపోయింది.
అలాంటిది మైథలాజికల్ అంశాలకు టైమ్ ట్రావెల్ స్టోరీని జోడించి తెరకెక్కిస్తున్న `వారణాసి` అంతకు మించి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చాల్సిందే. ఇదే విషయాన్ని స్ట్రాంగ్‌గా చెబుతూ జక్కన్న తన మార్కెటింగ్ స్ట్రాటజీతో చైనా, జపాన్ మార్కెట్‌లపై దృష్టి పెట్టాలని అప్పుడే అసాధ్యం అనుకున్న రూ.2000 కోట్ల మార్కుని దాటగలదని, అలా ప్లాన్ చేయని పక్షంలో `వారణాసి` బడ్జెట్‌ని రికవర్ చేయడం అనేది బిగ్ టాస్క్‌గా మారుతుందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
